ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతకు స్వయంగా కారకుడై ఉండి ఇసుకపై టీడీపీ అధినేత నారా. చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం విడ్డూరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్ష చేస్తున్నారని విమర్శించారు. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై చంద్రబాబు సాయంత్రంలోపు ఆధారాలు చూపాలని పార్ధసారధి సవాల్ చేశారు. కృత్రిమ కొరత సృష్టించాను అనే వాటిని నిరూపించాలన్నారు. తాను ఎక్కడ ఇసుకను దాచానో చూపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దాచిన ఇసుకతో ఏం పనులు చేశానో చెప్పాలన్నారు.


లేదంటే చంద్రబాబు దీక్ష చేస్తున్న ధర్నా చౌక్ లోనే తాను ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో విజయవాడ పోలీస్ కమీషనర్ కు దరఖాస్తు చేయబోతున్నానని ఎమ్మెల్యే కొలుసు స్పష్టం చేశారు. ఇసుకను దోచేసిన టిడిపినేతలు  తమపై ఆరోపణలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. నీవు, నీ లోకేష్ లక్షల కోట్ల అవినీతిని బయటపడకూడదనే ఉధ్దేశ్యంతో ఇసుకను మీ ఎమ్మెల్యేలకు దోచేసుకోమని ఇసుక రీచ్ లను అప్పగించావని ఆరోపించారు. నీ అండతో నాటి టిడిపి ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు ఇసుకను టన్నుల కొద్ది డంప్ చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. వ్యవస్దలను నాశనం చేసి అవినీతికి పట్టం కట్టిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తన తాబేదారు పవన కల్యాణతో కలసి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.




కృష్ణా, గోదావరి నదుల వరదతో ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవం కాదా అని అడిగారు. తన నివాసం పక్కనే ఇసుక అక్రమాలు తవ్వుతున్నప్పటికి చంద్రబాబు చోద్యం చూసిన మాట  వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణం ప్రమాదంలో పడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయల జరిమానాను విధించింది వాస్తవం కాదా అన్నారు. 
ఇసుక దోపిడీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి  వైయస్ జగన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు.ఇసుక ఎంత కావాలంటే అంత ఇసుకను పారదర్శకంగా నేడు సరఫరా చేస్తున్నారు.ఇసుకను డంపింగ్ యార్డులకు తరలించి రాష్ర్ట ప్రజలందరికి అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: