18 ఏళ్ళు దాటినా వారు ఇది మర్చిపోయారంటే.. అంతే సంగతులు. ఏం సంగతులు అని అనుకుంటున్నారా ? అదేనండి ఓటరు కార్డు.  ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2020 జనవరి 1 నాటికీ 18 ఏళ్లు వయసు పూర్తయ్యేవారంతా తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. 

                           

2020 జనవరి 15 వరుకు కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అయితే ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సవరించిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఓటర్ల వివరాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణకు 2019 నవంబర్ 30 తుది గడువుగా తెలిపారు.

                          

అయితే ఓటుహక్కు నమోదుకు జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కాగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు. సిటిజన్ సర్వీస్ సెంటర్లలో కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. 

                   

అయితే గుర్తింపు కార్డు కింద పాస్‌ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వం జారీచేసిన ఉద్యోగ ఫొటో ఐడీ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, రైతుల గుర్తింపు కార్డు తదితర వాటిలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. మరి చూశారుగా.. 18 ఏళ్లు వయసు నిండితే మర్చిపోకుండా ఓటు హక్కు వినియోగించుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: