ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈరోజు ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయబోతుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, బీసీ జనాభా గణనను పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు ఇప్పటికే పూర్తి చేశాయి. 
 
సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి మంత్రులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఏపీలో జనవరిలో ఎన్నికలు జరిగితే ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికే అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 
గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పించింది. 
 
అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ను 2,000 రూపాయల నుండి 2,250 రూపాయలకు పెంచింది. వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ అమలుతో 40 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేయటం గమనార్హం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన వారందరికీ 10,000 రూపాయలు బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. 
 
జనవరి 26వ తేదీన ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేయబోతుంది. ఈ పథకాన్ని జనవరి 26వ తేదీన కాకుండా జనవరి 9వ తేదీనే  అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇసుక కొరతపై ప్రజలలో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ 
స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ సమస్య కూడా  పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2019 ఎన్నికలలో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు సాధించిన వైసీపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: