పోలీసుల బాధ్యత ఏంటి  రక్షించడం.. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా చట్టానికి లోబడి వాళ్ళను రక్షించడమే వారి వృత్తి.  దానికోసం ఎంత కష్టమైనా సరే భరిస్తారు.  అయితే, కొంతమంది వ్యక్తులు మాత్రం పెద్దగా కష్టపడరు.  డ్యూటీలో చేరాం ఇంటికి చేరుకున్నాం.. ఎదో నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాం అని అనుకుంటారు.  కానీ, విదేశాల్లోని పోలీసులు అలాకాదు.  డ్యూటీని ఖచ్చితంగా చేస్తారు.  చెప్పింది చెప్పినట్టుగా చేయడమే వాళ్ళ డ్యూటీ.  


అందుకే చేయాల్సింది ఎంత ఉన్నదో అంత ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తుంటారు. కష్టాల్లో ఉన్నాడు కదా అని ఓ వ్యక్తిని పాపం పోలీసులు కష్టపడి ప్రాణాలకు తెగించి కాపాడారు.  కానీ, ఆ తరువాత ఆ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.  విషయం ఏమిటంటే.. మాంచెస్టర్ లో ఓ వ్యక్తి డ్రింక్ చేసి కారు డ్రైవ్ చేస్తూ వెళ్లి చెట్టుకు గుద్దేసి యాక్సిడెంట్ చేశాడు.  అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఆగి, ఆ కారు నుంచి అతడిని దించి.. పోలీస్ వ్యాన్ లో కూర్చోపెట్టారు.  


కానీ, పోలీసుల వ్యాన్ లో కూర్చున్న ఆ వ్యక్తి సరిగ్గా కూర్చోకుండా, పోలీస్ వ్యాన్ లో పాస్ పోసేశాడు.  దీంతో వాళ్లకు కోపం వచ్చింది. కానీ, డ్యూటీ తప్పదు.. కారులో కూర్చున్న వ్యక్తికీ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసి.. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.  మాములుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఫైన్ వేసి వదిలిపెట్టేవారు.  కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడమే కాకుండా, యాక్సిడెంట్ చేయడం, దాంతో పాటుగా పోలీసుల కారును పాడుచేయడంతో సదరు వ్యక్తికీ భారీ ఫైన్ వేసారట.  


ఫైన్ తో పాటుగా పాటు జైలు శిక్ష కూడా వేసినట్టు పోలీసులు చెప్తున్నారు.  రక్షించడానికి వెళ్తే పోలీసులనే ఇలా అవమానిస్తారా అని పాపం ఆ పోలీసులు వాపోతున్నారు.  సరేలే ఏం చెప్పగలుగుతాం చెప్పండి.  తాగిన వ్యక్తికీ ఏం చేస్తున్నాడో ఏం తింటున్నాడో ఎవరూ చెప్పలేరు.  వాడిని అలా వదిలేయడం తప్పించి ఏమి చేయలేము. ఆంటే అంతకంటే ఏమి చేయలేని పరిస్థితి.  అలా వదిలేయడమే.  


మరింత సమాచారం తెలుసుకోండి: