ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి . జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్రంగా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇసుక కొరత సమస్య తెరమీదకు రావడంతో ఆంధ్రా రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా వేడెక్కాయి. ఇసుక సమస్యపై నేడు చంద్రబాబు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తన నిరాహార దీక్షను విజయవంతం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు దీక్ష క్రమంలో  రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయని ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. 

 

 

 

 ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై  తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పార్టీ నవరత్నాల పేరుతో తొమ్మిది రకాల మోసాలకు పాల్పడుతున్నది  అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జాతీయ స్థాయిలో కూడా టిడిపి పార్టీ వైసీపీ అరాచకాలను ఎండగట్టేందుకు చంద్రబాబు తెలిపారు. వైసిపి వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సరైన పాలన అందించడంలో విఫలమైంది అంటూ విమర్శలు గుప్పించారు. 

 

 

 

  ఈ సందర్భంగా టిడిపి యువ నేతలతో సమావేశమైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పార్టీలో యువ నేతలకు పెద్దపీట వేసేందుకు నిర్ణయించామని తెలిపారు. పార్టీ  లోని 33 శాతం పదవులను 35 ఏళ్ల లోపు వారికి కేటాయిస్తామని పునరుద్ఘాటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని... తమ ప్రభుత్వ హయాంలో కేవలం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టినట్లు చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధిని చూసి  ఓట్లు వేస్తారని తాము భావించామని చంద్రబాబు అన్నారు. ఒకవేళ గత ఎన్నికలు తాము ఓట్లపై దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: