జనసేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివాహాల కేంద్రంగా వివాదాలు ముసురుతున్నాయి. ఆయ‌న మూడు పెళ్లిల్ల వ్య‌వ‌హారంపై విప‌క్షాలు ఇప్ప‌టికే....వివిధ ర‌కాలైన విమ‌ర్శ‌లు చేయ‌గా...తాజాగా వైసీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ``మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి? ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. జ‌న‌సేన  కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా ‘నిత్యకళ్యాణం’ గారూ.  ప్యాకేజి స్టార్లు, వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరు. అతిగా ఊహించుకోకండి.`` అంటూ విజ‌య‌సారెడ్డి ఓ ట్వీట్లో మండిప‌డ్డారు.


ఇక చంద్ర‌బాబు ఇసుక దీక్ష‌పైనా...విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన శైలిలో స్పందించారు. ``కొడుకేమో నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక రోజైనా భోజనానికి దూరం ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు.````ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయాడు @ncbn గారు. అపోజిషన్ లీడర్ గా రాణించాల్సిన వాడు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నాడు.`` అని వ్యాఖ్యానించారు. 


``తెలంగాణా,ఆంధ్రా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి చెల్లని కాసు అయిపోయాడు. లేదంటే  ముంబాయిలో తిష్ట వేసి నాలుగు భిన్నపక్షాలను ఏకం చేసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తా అని చిటికెలేసేవాడు.సారు పాదం మోపితే శని దేవత జిడ్డులా పట్టుకుంటుందని తెలిసిపోవడంతో ఫోన్లు కూడా ఎత్తడం లేదంట ఎవరూ.`` అంటూ ఎద్దేవా చేశారు. ``తుఫాను ఎక్కడ తీరం దాటేది నాకు ముందే తెలుసు. హైదరాబాద్ ను  నేనే నిర్మించా. నా విజన్-2020 డాక్యుమెంటును అబ్దుల్ కలామ్ కాపీ కొట్టారు. సూడోలాజియా ఫెంటాస్టికా (pseudologia fantas´tica) అనే మానసిక రుగ్మత వల్లే ఇలా అయిపోయారు పాపం. తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణమే.`` అంటూ కామెంట్లు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: