బాలల దినోత్సవం సందర్భంగా అందరు చిన్నపిల్లల కోసం ఏదోఒక ప్రోగ్రాం లు చేస్తుంటే.. బాబుగారు మాత్రం సింపతీ కోసం.. తన పట్టును సాధించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాగోలా మీడియాలో ఉంటూ గోలగోల చేయాలనీ చూస్తున్నాడు.  మీడియాపై పట్టుసాధించాలని చూస్తున్నాడు.  రాష్ట్రంలో పార్టీని సుస్థిరం చేయడానికి పధకాలు వేస్తున్నాడు.  


రాజకీయాలు అన్న తరువాత ఒడిదుడుకులు షరా మామూలే అనుకోండి. కానీ, బాబుగారికి చేతిలో అధికారం లేకుంటే అన్ని కష్టాలే గుర్తుకు వస్తాయి.  అధికారంలో చేతిలో ఉంటె.. రాష్ట్రానికి సంబంధించిన నష్టాలు గుర్తుకు వస్తాయి.  సింగపూర్ ఫ్లైట్స్ గుర్తుకు వస్తాయి. ఎవరికీ ఎలా రాసిపెట్టి ఉంటె అలా జరుగుతుంది.  ఎవరుమటుకు కాదంటారు చెప్పండి.  చెప్పిందే జరగాలి అని లేదు కదా.  ఇక ఇదిలా ఉంటె, ఈరోజు బాబుగారు విజయవాడలో ఇసుక కొరతను నిరసిస్తూ.. ఒకరోజు దీక్ష చేయబోతున్నారు.  


ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని అని చెప్పి టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. అభ్యర్ధించారు .. గతంలో పవన్ కూడా అంటకాగి ఉన్నాడు కాబట్టి తప్పదు అని చెప్పి సరేలే మద్దతు ఇస్తున్నానని చెప్పారు.  మద్దతు ఇవ్వడం కాదు.. దీక్షలో కూర్చోవాలి అని కూడా కోరినట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి మద్దతు ఇస్తే అంతవరకు బాగానే ఉంటుంది.  అలా కాకుండా అడిగారు కదా అని అత్యుత్సాహంగా వెళ్లి దీక్షలో కూర్చుంటే.. అధికారపక్షానికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టే అవుతుంది.  


అదెలా అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను దత్త పుత్రుడు దత్త పుత్రుడు అని అంటున్నారు.  అలా దత్త పుత్రుడు అని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీక్షలో కూర్చుంటే అది నిజం అని అధికార పక్షమే కాదు.. ప్రజలు కూడా నమ్మాల్సి వస్తుంది.  బాబు దీక్షకు మద్దతు ఇచ్చి.. మరోచోట పవన్ కళ్యాణ్ మరో కార్యక్రమం మొదలుపెడితే దానివలన ఉపయోగం ఉంటుంది.  ఇక బాబుగారు ఎన్ని దీక్షలు చేసుకున్నా, మీడియాలో ఎంత ఫోకస్ చేసుకోవాలి అని చూస్తున్నా.. 23 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ కావడం ఖాయం అని సోము వీర్రాజు చెప్పిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: