కర్ణాటకలో బహిష్కృతమైన ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.  17 మంది ఎమ్మెల్యేలు గతంలో తమ పార్టీకి రాజీనామా చేశారు.  అయితే, వారిని అనర్హులుగా అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.  దీనిపైన ఆ బహిష్కృత ఎమ్మెల్యేలు సుప్రీమ్ కోర్టుకు వెళ్లారు.  సుప్రీం కోర్టు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. అనర్హులైన వారికీ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది.  


కాగా, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ బహిష్కృత ఎమ్మెల్యేలంతా కలిసి బీజేపీలో జాయిన్ అయ్యారు.  17 అసెంబ్లీ నియోజక వర్గాలలకు డిసెంబర్ 5 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది తెలియాల్సి ఉన్నది.  ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి.  ముఖ్యంగా ఎలాగైనా గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. 


గతంలో కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  అయితే, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఇప్పుడు పూర్తిగా తెగిపోయింది.  రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోవడంట్ బీజేపీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది.  బహిష్కృత ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యతను బీజేపీ తీసుకున్నది.  దానికోసం ఇప్పటి నుంచే పావులు కడుపుతున్నది.  ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో..అందరు ప్రచారంలో మునిగిపోయారు.  


గెలిపించే బాధ్యత మొత్తం యడ్యూరప్పపైనే ఉన్నది.  ఆయనే ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించాలి.  ప్రతి నియోజక వర్గంలో అయన ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాడు.  ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఓటర్ల మైండ్ సెట్ మారకుండా బీజేపీకి ఓటు వేసేలా చూస్తున్నారు.  బీజేపీకి ఓటు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ టాస్క్ ను యడ్యూరప్ప ఎలా లీడ్ చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: