తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 40 రోజులకు చేరుకున్నప్పటికీ  కూడా ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం కాలేదు. ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు విషయంలో కేసీఆర్ మాత్రం మొండిపట్టు వీడలేదు . అంతేకాకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీలోని 5,100 రూట్లు ప్రైవేటీకరణ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక సీఎం  కేసీఆర్ తీరుతో  కార్మికులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు ఏంటో తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు. 

 

 

 మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు డెడ్లైన్లు విధిస్తుండడంతో ఈ ఆందోళన కాస్త ఎక్కువ అయిపోతుంది. హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుగుతున్నప్పటికీ... హైకోర్టు తీరూ  కూడా ఆర్టీసీ కార్మికులకు సానుకూలంగా కనిపించడం లేదు. మీరు వాదన చేయండి మేము వాయిదా వేస్తాం  అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ప్రభుత్వం హైకోర్టు తీరు . దీంతో హైకోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అయితే ఇప్పటికే ఆర్టీసీ సమ్మే విషయంలో  కేసీఆర్ తీరుతో ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా... ఎంతోమంది మనస్థాపంతో గుండెపోటుతో మరణించారు. 

 

 

 

 తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ నాగేశ్వర్ గురువారం ఉదయం ఆందోల్ మండలం జోగిపేటలో కన్నుమూశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ పేరుతో గత కొంతకాలంగా నాగేశ్వర్ మనస్థాపానికి గురయ్యాడు. తాజాగా కేసీఆర్ విధించిన డెడ్ లైన్  తో కండక్టర్ నాగేశ్వర్ మానసికంగా మరింత ఆందోళనకు గురయ్యాడు. ఇప్పటికే జీతం రాక కుటుంబ పోషణ భారమై బాధపడుతున్న నాగేశ్వర్... తమ భవిష్యత్తు ఏంటో అని కలతచెంది మతిస్థిమితం కోల్పోయి పిచ్చి గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇంటి ఓనరు నుంచి అదే చెల్లించాలంటూ ఒత్తిడి కూడా రావడంతో భార్య నాగేశ్వర్ ని  తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత అక్కడ చికిత్స పొందుతూ నాగేశ్వర్ తెల్లవారుజామున మృతి చెందినట్లు  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: