పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని ఏపీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఈ హామీ ఏంటంటారా.. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసు వారి ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తారు. ఈ మేరకు వైఎస్ జగన్ పాదయాత్రలో మత్స్యకార కుటుంబాలకు వాగ్దానం చేశారు.


ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి వైయస్సార్‌ మత్స్యకార భరోసా అని నామకరణం చేశారు. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయించింది. ఈనెల 21 నుంచి పథకం అమలవుతుంది. ఈ నిర్ణయంతో పాటు జగన్ కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.


వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యంలోనే విద్యాబోధన జరిపేందుకు మంతివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.తెలుగు, ఉర్దూ భాష తప్పనిసరిగా ఓ సబ్జెక్టుగా కొనసాగించాలని నిర్ణయించింది. పరిశ్రమలు, ఇతర కాలుష్య వ్యర్ధాల నిర్వహణ కోసం పర్యావరణ నిర్వహణ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించిన మంత్రివర్గం... త్వరలోనే 84 న్యాయాలయాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.ఎనిమిది దేవాలయాలకు పాలకమండళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.


ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యమంలో బోధనకు మంత్రివర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 1 నుంచి 6 వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ 12 తరగతి తప్పనిసరి సబ్జెక్టు గా ఉంటుందని పేర్కొంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో 98.5శాతం ఇంగ్లిషు మీడియంలోనే చదువుతుంటే... ప్రభుత్వ స్కూళ్లలో కేవలం 34 శాతం స్కూళ్లలో మాత్రమే ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారని తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ పాలసీ 2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్‌ పవర్‌ పాలసీ –2018, ఆంధ్రప్రదేశ్‌ విండ్,సోలార్, హైబ్రిడ్‌ పవర్‌ పాలసీ 2018 పాలసీల సవరణకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం –2008కు సవరణ చేసింది. న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: