సుప్రీం కోర్టు గత కొన్ని రోజులుగా దేశంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఈనెల 17 వ తేదీన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి రిటైర్ కాబోతున్న సంగతి తెలిసిందే.  కాగా, రిటైర్ అయ్యేలోపుగా సుప్రీం లో పెండింగ్ లో ఉన్న టాప్ కేసులను పరిష్కరించాలి అనుకున్నారు.  కోర్టుకు సెలవులు ఇతర పెండింగ్ విషయాలు పూర్తయ్యాక నవంబర్ 4 వ తేదీన సుప్రీం కోర్టు తిరిగి ప్రారంభమైంది.  


సుప్రీం కోర్టు తిరిగి ప్రారంభమైన తరువాత సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన కేసులకు సంబంధించిన తీర్పులను వరసగా ప్రకటిస్తూ వస్తున్నారు.  అందులో అయోధ్య, కర్ణాటక బహిష్కృత ఎమ్మెల్యేలు, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా ఆఫీస్ ను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చే కేసును, అలానే శబరిమల మహిళల ప్రవేశంపై రివ్యూ తీర్పును, రఫెల్ వివాదంపై తీర్పు, అదే విధంగా రాహుల్ గాంధీ గతంలో చేసిన చౌకీదార్ కామెట్స్ కు సంబంధించిన తీర్పు కూడా ఈరోజు వెలువడబోతున్నది.  


ప్రధానంగా శబరిమల రివ్యూ తీర్పుపైనే అందరి దృష్టి ఉన్నది.  శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదు.  ఎందుకంటే వారు ఆ మూడు రోజుల మైల ఉంటుంది ఉంటుంది.  ఆ మైల కారణంగా వారిని శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించేందుకు అంగీకరించడం లేదు. అయితే, వయసు మళ్ళిన వ్యక్తులను మాత్రం ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు.  


దీంతో గతంలో చాలామంది సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు.  మహిళలను సైతం శబరిమల ఆలయంలోకి ప్రవేశించేలా తీర్పు ఇవ్వాలని కోరగా.. దానికి అనుగుణంగానే గతంలో తీర్పు వచ్చింది.  కానీ, ఆ తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు కాగా దానిపై నేడు రివ్యూ చేసి తీర్పు ఇస్తున్నారు.  ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఈ తీర్పు వెలువడ బోతున్నది.  దీంతో పాటుగా రఫెల్, రాహుల్ తీర్పు కూడా రాబోతుండటంతో సుప్రీం కోర్టు వద్ద సందడి నెలకొంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: