స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. అందుకని నెహ్రు ఎక్కడికెళ్లినా పిల్లలను వెతికి మరీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించేవారు. అంతే కాకుండా వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు.  పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయణ్ని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు.


1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 14ను ‘చిల్డ్రన్స్ డే’గా జరుపుకొంటున్నాం. ఇక స్వతహాగా రచయిత అయిన నెహ్రు స్వాతంత్ర పోరాటంలో భాగంగా జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె ఇందిరకు అనేక ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాల్లో బోలెడు మంచి విషయాలు తెలిపే వారు. అందులో పిల్లలు ఎలా ఉండాలి. ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి. సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి. సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను వివరించేవారు.


అలా ఇందిర ‘ఉక్కు మహిళ’గా నెహ్రూ నింపిన స్ఫూర్తి, ధైర్యంతో పేరుగాంచారు.. ఇదే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రధానిగా పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.. ఆనాడు ఇందిరమ్మకు నెహ్రు రాసిన ఉత్తరాలు నేటి తరానికి పాఠాలయ్యాయి. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించ దగినవే. ఇకపోతే ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని అత్యంత సంతోషంగా దేశవ్యాప్తంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. అదీగాకుండా నెహ్రు పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తూ, ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకోవడానికి బలమైన కారణం ఉంది.


అదీగాక ప్రపంచ దేశాలన్నీ నవంబర్ 20 న బాలల దినోత్సవం జరుపుకుంటే భారత్‌లో మాత్రం ఆరు రోజులు ముందుగానే ఈ వేడుకను నిర్వహించుకుంటాం. ఇకపోతే స్వాతంత్య్రానికి ముందు నవంబరు 20న చిల్డ్రన్స్ డే నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలు తీర్మానించాయి. 1964 వరకు భారత్ కూడా దీనినే అనుసరించినా నెహ్రు మరణం తర్వాత ఆయన గుర్తుగా నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం.


ఇక చిల్డ్రన్స్ డే రోజు ప్రతి పాఠశాలల్లో పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. అనంతరం సాంసృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు. పిల్లల అరుదైన వేషధారణ కూడా ఆహ్లాదం నింపుతుంది. మొత్తంగా స్కూల్స్‌లో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: