వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం బోధన కారణంగా తెలుగులోనే చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు చాలా మంది కేవలం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం లేదంటే వ్యాపారం చేయడం వంటివి చేస్తున్నారు.  20 ఏళ్ల క్రితమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను అప్పటి ప్రభుత్వాలు ప్రాధమిక విద్య నుంచి ప్రవేశపెట్టి ఉంటె.. ఈపాటికి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వచ్చేసి ఉండేది.  


చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు, మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు.  కానీ, అప్పట్లో కేవలం తెలుగు మాత్రమే భోధనగా ఉండేది.  దాని వలన పల్లెటూరిలో ఉండే పిల్లలకు తెలుగు తప్పించి మరో భాష రాలేదు.  డబ్బున్న వాళ్లకు మాత్రమే ఇంగ్లీష్ లో చదువుకునే అవకాశం కలిగింది.  ఇప్పుడు దాన్ని సమూలంగా మార్చేందుకు జగన్ సిద్ధం కావడం నిజంగా గొప్ప విషయంగా చెప్పాలి.  


ఎందుకంటే మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి.  పల్లెటూరిలో ఎందరో టాలెంటెడ్ ఉన్న విద్యార్థులు ఉన్నారు.  వారికీ ఇంగ్లీష్ భాషను నేర్పిస్తే తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు.  అందులో సందేహం అవసరం లేదు.  గొప్ప స్థాయికి ఎదగాలి అనుకుంటే దానికి కావాల్సింది ప్రోత్సాహం.  దీనిని ముఖ్యమంత్రి జగన్ అందించబోతున్నారు.  పైగా ప్రభుత్వ పాఠశాలలను గతంలోని ప్రభుత్వాలు చాలా వరకు నిర్లక్ష్యం చేశాయి.  


అందుకే ప్రైవేట్ వైపు పిల్లలు ఆకర్షితులౌతున్నారు.  అలా కాకుండా ప్రైవేట్ పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను బోధించాలి అనే రూల్ తీసుకొని వస్తే ఈరోజు ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉండవు.  పైగా తల్లిదండ్రులకు అంతటి భారం కూడా కాదు.  తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సంపాదన మొత్తాన్ని పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తున్నారు.  ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి.  సోషల్ మీడియాలో చాలామంది జగన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కు సపోర్ట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: