చంద్రబాబు వయసు డెబ్బయ్యేళ్ళు. ఆయన రాజాకీయ జీవితం ఓ విధంగా సంపూర్ణమేనని  చెప్పుకోవాలి. ఎంతకష్టపడ్డా కనీసం మంత్రిగా కూడా కాలేని ఎందరో ప్రజా నాయకులు ఉన్న పోటీ రాజకీయాల్లో ఆయన  సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతను సాధించారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అన్న కీర్తిని పొందారు. ఇక బాబు మరో మారు విపక్ష పాత్రలోకి వచ్చేశారు.


అయితే టీడీపీకి ఇపుడు కొత్త జోష్ ఇద్దామనుకుని  బాబు చేస్తున్న ప్రయత్నాలు  ఒక్కొటిగా బెడిసికొడుతున్నాయి. బాబు లో స్టఫ్ అయిపోయిందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ధర్నాలు, ఆందోళనలు, నిరశన వ్రతాల రోజులు పోయాయి. ఎవరికీ పట్టని ఆధునాతన రోజులల్లోకి అంతా వచ్చేశారు. పైగా పోగు చేసిన జనాలతో జాతర‌లు పెడితే పార్టీలు బలపడినట్లు కూడా కాదు.


అసలు మీటింగుల విషయంలో కూడా ఎవరికీ నమ్మకాలు, మోజులు లేవు. జనాలను తోలుకొచ్చి మీటింగులు పెట్టుకుంటారన్నది దశాబ్దాల కాలంగా స్థిరపడిపోయిన భావన. ఈ నేపధ్యంలో అయిపోయిన పెళ్ళిని మద్దెల వాయిద్యంలా చంద్రబాబు ఇసుక దీక్ష పేరిట ఈ రోజు చేసినది  షో ఫ్లాప్ అనే అంటున్నారు. బాబు ముందు పార్టీని చక్కదిద్దుకునే మార్గాలు ఆలోచించాలని కూడా సూచిస్తున్నారు. పడిపోతున్న  ఇంట్లో పరమాన్నాలు పెట్టినా ఎవరూ ఉండరన్న సంగతిని బాబు గుర్తెరిగి తన తరువాత పార్టీకి నాధుడు ఒకడు ఉన్నాడని గట్టిగా చెప్పగలగాలి, భరోసా ఇవ్వాలి. 


ఇపుడు టీడీపీకి అదే పెద్ద సమస్య. నాయకత్వ సంక్షోభంలో పార్టీ ఉంటే బాబు లేని పోని సమస్యలతో రోడ్డు మీదకు వస్తే అసలుకే ఎసరు అంటున్నారు. ఇక టీడీపీలో బాబు మరో నాలుగున్నరేళ్ళ పాటు పార్టీని నడిపించాలన్న సంగతిని గుర్తుపెట్టుకుని అడుగులు ముందుకువేస్తేనే పార్టీకి పచ్చదనం ఉంటుంది. ఆ సంగతి గుర్తెరగాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: