లోకం ఎలా తయారైందంటే కేవలం శృంగారం కోసమే బ్రతుకుతున్నట్లుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూడు ఆడపిల్లలను ఆటవస్తువులుగా, తమ వాంఛలను తీర్చే విలాసజీవిగా చూస్తున్నారే తప్పా వారికంటూ ఓ మనస్సు ఉంటుందని గ్రహించలేక పోతున్నారు. ఇప్పుడు సమాజంలో వస్తున్న ఈ మార్పు వల్ల ముందు ముందు లోకంలో భద్రత కరువై అత్యాచారాలు ఇంకా పెరిగే ఆస్కారం ఉంది.


ఇకపోతే తనతో సెక్స్‌ చేయడానికి నిరాకరించిందని 19 ఏళ్ల యువతిని పక్కింటి యువకుడు హతమార్చాడు. ఈ  దారుణ ఘటన చోటు చేసుకుంది, థానే జిల్లాలోని కళ్యాణ్‌లో. ఇక హంతకుడు, ప్రాణాలు కోల్పోయిన యువతి ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఇకపోతే వివరాలు తెలుసుకుంటే దీపక్ భంగే అనే 22 ఏళ్ల యువకుడు,  మీ ఇంట్లోకి ఉడుత వచ్చిదంటూ.. మంగళవారం మధ్యాహ్నం యువతి ఫ్లాట్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.


ఏ అమ్మాయి అయినా ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొనది కదా అందుకే బాధితురాలు కూడా ప్రతిఘటించింది దీంతో పట్టరాని కోపంతో విచక్షణ కోల్పోయిన ఆ యువకుడు కర్కశంగా గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు.. ఇక నవీ ముంబైలో పని చేసే మృతురాలి తల్లి మంగళవారం రాత్రి తన డ్యటీ ముగించుకుని ఇంటికి వచ్చి డోర్ తీయగానే.. నేల మీద విగత జీవిగా పడి ఉన్న తన కూతుర్ని చూసి ఆమె షాకైంది. వెంటనే డోంబివ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది.


ఇకపోతే హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించిన. కాసేపటికే నిందితుణ్ని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు..ఇదండి ఇప్పటి వారు నేర్చుకుంటున్న పద్దతులు. సమాజాం ఇలాగే ఉంటే ప్రతి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు ముందు ముందు ఉద్యోగాలు మానేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని  బ్రతకవలసి వస్తుంది?  



మరింత సమాచారం తెలుసుకోండి: