ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదటి సారి తెలపడం జరిగింది. శివసేనను ముఖ్య లక్ష్యంగా చేసుకొని విమర్శల వర్షం కురిపించారు. శివసేన డిమాండ్లు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం తెలియచేయడం జరిగింది. ఇక ఎన్నికల ముందు నిర్వహించిన ప్రచార సభల్లో.. దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎం అవుతారని మోదీ, తాను చాలాసార్లు చెప్పామని అమిత్ షా తెలియాచేయడం జరిగింది. 


తాజాగా శివసేన ఇప్పుడు తెర మీదకు తెస్తోన్న కొత్త డిమాండ్లు మాకు ఆమోద యోగ్యం కాదు అని  అమిత్ షా తెలియాచేయడం జరిగింది. అసెంబ్లీ గడువు ముగిశాక గవర్నర్ అన్ని పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపు ఇచ్చిన కూడా  బీజేపీ చీఫ్.. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన లేదా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అసలు రాలేదు అని తెలిపాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సంఖ్యా బలం ఉన్న ఏ పార్టీ అయినా సరే.. ఇప్పుడైనా గవర్నర్‌ వద్దకు రావచ్చు అని అమిత్ షా తెలియచేయడం జరిగింది.


మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడం వల్ల పార్టీ ఆందోళనకు గురి అవ్వడం.. సానుభూతిని పొందడం కోసమే అని బీజేపీ చీఫ్ అన్నాడు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయడం జరిగింది. కానీ సీఎం పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామని ఎన్నికల తర్వాత ప్రతిపాదించడం జరిగింది. ఇక సీఎం పీఠాన్ని పంచుకుందామంటేనే.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని లేదంటే ప్రభుత్వంలో చేరేది లేదని కమలం పార్టీకి పూర్తి వివరాలతో తెలియచేయడం జరిగింది.  మొత్తానికి మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా.. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు రావడం జరిగింది. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లను సొంతం చేసుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి పోటీ చేయడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: