సుప్రీం కోర్టు నేడు పలు సంచనల తీర్పులకు వేదిక అవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తో కూడిన ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది. నేటి తీర్పుల్లో ప్రధానమైనది 'ఏజిఆర్ చార్జెస్'. స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్‌ ఫీజులను కలుపుకొని  ఏజీఆర్‌ ఛార్జీలుగా చెబుతారు. ఈ ఏజిఆర్ చార్జెస్' పై సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది.


ఎయిర్‌టెల్‌ రూ. 21,682 కోట్లు, వొడాఫోన్‌ రూ. 19,823 కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ. 16,456 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ. 2,537 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2,098 కోట్లు ఏజిఆర్ చార్జెస్ కింద డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్ కు బకాయి పడ్డాయి. వీటిపై వడ్డీలు, అపరాధ రుసుంలు కలిపి మొత్తం రూ.92,641 కోట్లకు చేరాయి. ఈ మొత్తాన్ని టెలికాం ఆపరేటర్స్ కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. ఈ చార్జెస్ లో టెలీకాం యేతర ఆదాయాన్ని మినహాయించాలని 2005లో సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ).. టీడీఎస్‌ఏటీ(టెలికాం డిస్ప్యూట్‌ సెటిల్మెంట్‌ అండ్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూన్‌)లో సవాలు చేసింది. దాదాపు 10ఏళ్లు సాగిన ఈ న్యాయపోరాటం 2015లో కొలిక్కి వచ్చింది. తీర్పు టెలికాం ఆపరేటర్స్ కు అనుకూలం గా వచ్చింది. కానీ కేంద్రం మళ్ళీ సుప్రీం కోర్టు లో అప్పీల్ చేయగా కేంద్రానికి అనుకూలం గా తీర్పు ఇచ్చింది సుప్రీం.


సుప్రీం తీర్పుతో టెలికాం సంస్థలు రూ.92వేల కోట్లను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిల్లో ఇప్పుడు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాపైనే భారీగా భారం పడింది. ఎయిర్‌టెల్‌ రూ.42వేలకోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 40 వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అసలే టెలికాం రంగంలోని సంస్థలకు రూ.4లక్షల కోట్ల మేరకు అప్పులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీం ఇచ్చే తీర్పు పై టెలికాం ఆపరేటర్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: