అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇసుకను కూడా కబ్జా చేస్తోందని, ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దొరుకుతుంటే ఇంటి దొంగలు ముఖ్యమంత్రికి కనపడరా ? అని నిలదీశారు.  ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో 12 గంట‌ల దీక్ష చే పట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు.


ఈసంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ స మస్య సృష్టించారని వ్యాఖ్యానించారు. దాదాపు 35 లక్షల మంది పూట తిండికి కూడా నోచుకోని దుస్థితి క ల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారని, రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే... కాలం చెల్లి చనిపోయారని మంత్రులు అనగలరా? అని ప్రశ్నించారు.


తెలుగుదేశం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ఎవ్వరూ నష్టపోలేదని, సొంత పొలంలో మట్టి ఇంటికి తీసుకుపోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి కావాలనటం అహంభావానికి నిదర్శనమని బాబు  పే ర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసురులో చెపాల్సిన బాధ్యత సీఎంపై ఉందని ఆయ‌న నిల‌దీశారు. సమస్య లేకుండానే కృత్రిమ ఇసుక సమస్య సృష్టించారని విమ‌ర్శించారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక చల్లుతోంది. ఈ రోజు నుంచే.. ఇసుక వారోత్సవాలు ని ర్వహించాలని నిర్ణయించి, అధికార యంత్రాంగం మొత్తాన్ని ఇసుకపైనే.. ఉంచాలని నిర్ణయించారు.


చంద్రబాబు గతంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ధర్మపోరాట దీక్ష పేరుతో 12 గంటల దీక్ష చేశారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇసుక కొరత, వైసీపీ దాడులను నిరసిస్తూ పోరాటాలను ప్రారంభించింది. పోరాటాన్ని ఉధృతం చేసి ఆయా వర్గాలను ఆకట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే వైసీపీ నేతలు.. వీలైనంతగా.. ఎదురుదాడి చేసేందుకు సీఐడీ పోలీసుల్ని కూడా వాడుకుంటున్నారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: