గత కొన్ని రోజులుగా ఇసుక రగడ రగులుతూనే ఉంది. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత  పై ప్రతిపక్షాలు అధికార పార్టీ మధ్య  విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయయి...  దీంతో రాష్ట్ర అభివృద్ధికి పులిస్టాప్ పడిపోయింది. ఇక ఇసుక కొరత సమస్య తో భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. సరైన ఉపాధి లేక కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. 

 

 

 

 దీంతో భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి. దీంతో ఎంతో మంది కార్మికులు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు . అయితే దీనిపై ప్రతిపక్షాలన్నీ నిరసన దీక్షలు కూడా చేపడుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత  సమస్యను  తీర్చాలంటూ అధికార వైసీపీ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి.ఈ నేపథ్యంలో విజయవాడలోని ధర్నాచౌక్లో చంద్రబాబు ఇసుక దీక్షను చేపట్టారు..ఈ సందర్బంగా మాట్లాడిన  టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇసుకను కబ్జా చేస్తూ జగన్ సర్కార్ పెత్తనం చెలాయిస్తూ ఉందంటూ చంద్రబాబు మండిపడ్డారు. తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో  పుష్కలంగా ఇసుక దొరుకుతుంటే  ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారూ.ఇంటి దొంగలు జగన్ కు  కనబడరా అని అడిగారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా 35 లక్షల మంది తిండికి కూడా నోచుకోని దుస్థితి తీసుకువచ్చారు అంటూ విమర్శించారు. 

 

 

 

 రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ భవనాలు నిర్మించే పరిస్థితి లేదని... భవన నిర్మాణ రంగానికి అనుసంధానం ఉన్న 125 వృత్తుల వారు కూడా రోడ్డున పడ్డారు అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పొలంలో మట్టిని తీసుకోవాలన్న ప్రభుత్వం అనుమతి కావాలంటూ వైసీపీ ప్రభుత్వం అనడం దుర్మార్గానికి పరాకాష్ట  అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త సమస్యలు తీర్చాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: