పతివ్రత పాయసం చేస్తే తెల్లారిన చల్లారలేదన్నట్లుగానే ఏపీలో ప్రతిపక్షనేత చంద్రబాబు రాజకీయాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా ఎలాంటి పోరాటాలు చేసిన అది ప్రజల కోసమే అన్నట్లు బాబు బిల్డప్పులు ఎక్కువైపోయాయి. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో బాబు పార్టీని నిలుపుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రజల్లో లేకపోతే ఇబ్బంది అని భావించి ఏదొక విషయం మీద వైసీపీ ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు.


ఇక తాను, తమ పార్టీ నేతలు రాజకీయ నిరుద్యోగులు మిగిలిపోకూడదని ఇసుక సమస్యని రాజకీయంగా వాడుకుంటున్నారు. అందుకే ఇసుక విషయంలో పలు సార్లు ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. తాజాగా ఇసుకపై 12 గంటలు నిరాహార దీక్షకు కూడా దిగారు. అయితే ఇదే బాబు అధికారంలో ఉన్నప్పుడూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ పోరాటాలు, దీక్షలు చేస్తే విమర్శలు చేశారు. 


అసలు గత ఐదేళ్ల పాటు వైసీపీ...ఇసుకలో టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై పోరాటం చేస్తూనే వచ్చింది. కానీ అలా పోరాటం చేస్తున్న వైసీపీని, ఆ పార్టీ నేతలనీ టీడీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. అయితే ఇప్పుడు పొజిషన్స్ మారడంతో బాబు నీతి కబుర్లు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక మంచి పథకాలు, నిర్ణయాలు అమలు చేసిన ప్రతిదానిలోనూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. 


ఇక గతంలో ఇసుక విషయంలో తాము చేసిన అక్రమాలని మరిచిపోయి, ఇప్పుడు పోరాటాలు, దీక్షలకు దిగుతున్నారు. అది కూడా ఇసుక పూర్తిగా లభ్యత మొదలయ్యాక దీక్షకు దిగి..రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే గతంలో ఇసుకలో అక్రమాలకు పాల్పడిన వారే నేడు దీక్షలో హడావిడి చేస్తున్నారు. మొత్తానికి తాను చేస్తే పవిత్రం..పక్కవారు చేస్తే అదేదో అన్నట్లుగా బాబు రాజకీయం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: