ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతకు నిరసనగా ఈరోజు విజయవాడలో 12గంటల దీక్ష చంద్రబాబు చేపట్టిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఇసుక అక్రమ రవాణాకు, ఇసుక కృత్రిమ కొరతకు కారణం వైసీపీ నేతలేనని టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. నిన్న ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబు చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపకపోతే చంద్రబాబు దీక్ష పక్కనే దీక్షకు దిగుతానని  హెచ్చరించారు. 
 
ఎమ్మెల్యే పార్థసారథి కొద్దిసేపటి క్రితం దీక్షకు బయలుదేరారు. విజయవాడ బందర్ రోడ్ దగ్గర క్యాంప్ ఆఫీస్ లో దీక్షకు బయలుదేరగా పోలీసులు పార్థసారథిని అడ్డుకొని దీక్షకు అనుమతి లేదంటూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పార్థసారథి మాత్రం ఎట్టి పరిస్థితులలోను దీక్షకు దిగుతానని చెబుతున్నాడు. పార్థసారథి హోం మంత్రి, పోలీస్ ఉన్నతాధికారులకు ధర్నా చౌక్ వద్ద దీక్షకు అనుమతించాలని లేఖ రాశారు. 
 
కానీ పోలీసులు మాత్రం ఈ దీక్షకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం ఎమ్మెల్యే పార్థసారథి దీక్ష ఉద్రిక్తతకు చోటు ఇవ్వకూడదనే కారణంతో అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి శాంతియుతంగా నిరసన తెలపటానికి ప్రయత్నిస్తోంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించాడు. 
 
ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నాడని అన్నారు. వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఇసుక గత వారం రోజుల నుండి అందజేస్తోందని పార్థసారథి తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న సమయంలో కుటిల రాజకీయాలు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వరద కారణంగానే ఇసుక సమస్య ఏర్పడిందని పార్థసారథి అన్నారు. చంద్రబాబుకు మతిపోయి దీక్షలు చేస్తున్నారని పార్థసారథి విమర్శలు చేశారు. 


 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: