పాసం మ‌నిమ‌నిషి కొడుకే క‌దా అని ఇంట్లోకి రానిస్తే.. న‌మ్మిన య‌జ‌మానుల‌నే మోసం చేసి.. త‌ల్లి ప‌ని చేసే ఇంటిల్లోనే చోరీకి తెగబడ్డాడో బాలుడు. వివ‌రాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ నగర్ పరిధిలోని బండ్లగూడ శారదానగర్‌లో నివాసం ఉండే గోవర్ధన్ రెడ్డి.. ఓ  సిమెంట్ వ్యాపారి. వ్యాపారస్తుడు కావడంతో ఆయన దగ్గర ఎప్పుడూ లక్షల్లో నగదు ఉండేది. అయితే ఆ అపార్ట్‌మెంట్‌కు కాపలాదారుగా ఉండే ఓ కుటుంబం సెల్లార్‌లో నివసిస్తోంది. వారికి ఓ కుమారుడు (16) ఉన్నాడు. అతడి తల్లి గోవర్థన్ ఇంట్లో పని చేస్తోంది. ఈ క్రమంలో తల్లితో కలిసి అతడి ఇంటికి వెళ్లే బాలుడు వారికి బాగా దగ్గరయ్యాడు. 


పనిమనిషి కొడుకే కదా అని గోవర్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు పెద్దగా అభ్యంతర పెట్టేవారు కాదు. అత‌డిని బాగా చూసుకునేవారు. కానీ.. ఇదే వారి పాలిట శాపమైంది. గోవర్థన్‌రెడ్డి ఇటీవల 25 లక్షల రూపాయలు తెచ్చి బీరువాలో పెట్టాడు. గమనించిన బాలుడు వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలోని రూ.25 లక్షలు తీసుకుని సమీపంలో నివసించే తన బాబాయికి తీసుకెళ్లి ఇచ్చాడు. అయితే డ‌బ్బులు అవ‌స‌ర‌మై గోవర్థన్ ఈ నెల 8న బీరువా తెరిచేందుకు ప్రయత్నించగా తాళం చెవి కనిపించలేదు. 


దీంతో అనుమానం వచ్చిన ఆయన బీరువా పగలగొట్టి చూసి షాకయ్యాడు.  లోపల తాను పెట్టిన రూ.25 లక్షలు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంట‌నే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో సెక్యూరిటీగార్డు కుమారుడిని ప్రశ్నించగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు ఆ బాలుడిని గ‌ట్టిగా విచారించ‌డా తానే ఈ చోరీ చేసాన‌ని ఒప్పుకున్నాడు. దీంతో అతడి ద‌గ్గ‌ర ఉన్న 25 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకొని.. నిందితుడైన బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: