శబరిమల కోర్టు తీర్పు కేసు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ఈ కోర్టు తీర్పును బట్టి శబరిమల విషయంలో మహిళలు ఎంట్రీకి అనుమతి ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. 2018లో ఇచ్చిన తీర్పును అనుగుణంగానే రివ్యూ తీర్పు ఉన్నట్టుగా తెలుస్తోంది.  అయితే, ఈ విషయంలో విస్తృతమైన చర్చ జరగాలని, ఐదుగురు బెంచ్ తో కూడిన ధర్మాసనం సరిపోదని, మరో ఇద్దరు ధర్మాసనం అవసరం అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.  


మరింత చర్చ జరగాలి అనే తీర్పును అనుసరించి ఇచ్చిన తీర్పును 3:2 తో బెంచ్ రిలీజ్ చేసింది.  ఈ తీర్పును బట్టి చూసుకుంటే, శబరిమల ఆలయంలోకి మహిళలు ఎంట్రీకి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.  మహిళలకు ఇది ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.  కానీ, శబరిమల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్టు దీనిని బట్టి తెలుస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. ఆలయ ధర్మానికి వ్యతిరేకంగా తీర్పు ఉందని అంటున్నారు.  


మహిళలకు అనుకూలంగా తీర్పు రావడంతో.. శబరిమల వెళ్లేందుకు చాలామంది మహిళలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శబరిమలలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఇప్పటికే అక్కడ 10వేలమంది పోలీసులను మోహరించారు.  శబరిమలకు మహిళలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. 2018లో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎలాగైతే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో అలా కాకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు కలుగకుండా చూడాలని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.  


మహిళలకు ఎందుకు అనుమతి ఇవ్వరు అని అంటున్నారు.  మహిళలకు సమానమైన హక్కులు ఉన్నప్పుడు, దేవాలయాల్లోకి ఎందుకు అనుమతి ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. తాము వెళ్తామా లేదా అన్నది తరువాత విషయం అని, ముందు అనుమతి ఇవ్వాలని అంటున్నారు.  తిరుపతి వంటి దేవాలయాల్లోకి అనుమతి ఉన్నప్పుడు శబరిమలలోకి ఎందుకు అనుమతి ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: