భార‌త ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలో 'సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF)' స్పోర్ట్స్ కోటాలో  హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి సరైన అర్హతలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది. ఇక ఇంటర్ అర్హతతోపాటు.. సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని నోటిఫికేషన్ తెలియచేస్తుంది. దరఖాస్తులు మాత్రం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
మొత్తం  హెడ్ కానిస్టేబుల్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ)  300 పోస్టులు ఉన్నాయి. క్రీడాంశాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకుందామా మరి .. అథ్లెటిక్స్‌ 91, బాక్సింగ్ 11,  బాస్కెట్‌బాల్‌ 08,  జిమ్నాస్టిక్స్‌ 04,  ఫుట్‌బాల్‌ 06, హాకీ 12,  హ్యాండ్‌బాల్‌ 09,  జూడో 17,  క‌బ‌డ్డీ 20,  షూటింగ్ 32, స్విమ్మింగ్‌ 14,  వాలీబాల్ 08,  వెయిట్‌లిఫ్టింగ్‌ 32 ,  రెజ్లింగ్ 20 ,  తైక్వాండో 16 . ఇక అర్హత‌ విషయానికి వస్తే ఇంట‌ర్ ఉత్తీర్ణత కచ్చితంగా ఉండాలి. సంబంధిత క్రీడ‌లో రాష్ట్రస్థాయి/జాతీయ‌స్థాయి/ అంత‌ర్జాతీయస్థాయి గుర్తింపు ఉండాలి నిర్దేశిత శారీర‌క ప్రమాణాలు కూడా కచ్చితంగా ఉండాలి.


ఇక వయసు వ‌యోపరిమితి విషయానికి వస్తే  01.08.2019 నాటికి 18-23 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానానికి వస్తే  ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం మాత్రం  ట‌్రయ‌ల్ టెస్ట్‌, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, మెరిట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన  తేదీలు..  చివ‌రితేది: 17.12.2019 లోపు దరఖాస్తు చేసుకోవాలి.  నార్త్-ఈస్ట్ రీజియన్ అభ్యర్థులకు చివరితేది మాత్రం  24.12.2019 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ లో  నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి అని మనవి చేస్తున్నాము.  మొత్తానికి స్పోర్ట్స్ కోటా వారికీ ఒక మంచి అవకాశం అనే చెప్పాలి ఈ నోటిఫికేషన్.


మరింత సమాచారం తెలుసుకోండి: