ఆగస్టు 5న ఆర్టికల్ 370ని సవరించి, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం తొలగించింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
సుదీర్ఘంగా సాగిన బాబ్రీ మసీదు-రామ మందిర వివాదంపై నవంబర్ 9న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వివాదాస్పద భూమిని హిందూ పక్షానికి చెందుతుందని ప్రకటించి, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.


ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తదుపరి దృష్టి పెట్టే అంశం ఏంటన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యాల్లో ఉమ్మడి పౌర స్మృతి అన్నింటికన్నా ముందుంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం, పౌరసత్వ చట్టం చేయడం కూడా ఈ జాబితాలో ఉంటాయని చెబుతున్నారు.


''వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎన్ఆర్‌సీ, పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే చాలా కృషి చేసింది. ఈ రెండు అంశాలకు ఇటీవల కాలంలో బీజేపీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రజల అంగీకారం పొందాల్సి ఉంటుంది. అందుకే తర్వాత దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టొచ్చు'' అని ఆయన చెప్పారు.మతం, వర్గంతో సంబంధం లేకుండా అందరికీ ఒకేలా వర్తించే పౌర చట్టం.



వివాహం, విడాకులు, ఆస్తుల పంపకం లాంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని మతాలకూ ఒకే లాంటి నియమనిబంధనలు ఉమ్మడి పౌర స్మృతి ద్వారా వర్తిస్తాయి.
ప్రస్తుతం స్థూలంగా చూసుకుంటే భారత్‌లోని చట్టాలు రెండు రకాలు. ఒకటి సివిల్, రెండోది క్రిమినల్.వివాహం, ఆస్తులు, వారసత్వం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అంశాలన్నీ సివిల్ చట్టాల కింద ఉంటాయి.ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కొన్ని నెలల క్రితం అన్నారు.


ప్రస్తుత లోక్‌సభ మొదటి సమావేశంలోనే బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఉమ్మడి పౌర స్మృతి డిమాండ్‌ను లేవనెత్తారు.అయితే, ఈ ఉమ్మడి పౌరస్మృతిని తేవడం అంత సులువు కాదని ప్రదీప్ సింగ్ అభిప్రాయపడ్డారు.''వివాహం, అస్తులకు సంబంధించి వ్యవహారాలకు ఇప్పుడు మతాన్ని బట్టి చట్టాలు వేర్వేరుగా ఉన్నాయి. అందరికీ ఒకేలా నియమనిబంధనలు తెస్తే కొన్ని వర్గాలు నష్టపోవచ్చు. కొందరికి లాభం కలగొచ్చు. అందరినీ సమాన స్థాయికి తెచ్చేలా సర్దుబాట్లు చేయడం చాలా కష్టం'' అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: