ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో జరిగిన మనబడి నాడు - నేడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సీఎం జగన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలు, భావి నిర్ణేతలు అని అన్నారు. ఇప్పటికే ల్యాండ్ ఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ కు మారామని సీఎం జగన్ అన్నారు. మరో పది సంవత్సరాల తరువాత రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని సీఎం జగన్ అన్నారు. 
 
మన పిల్లలు ఇంగ్లీష్ చదువులు చదవకపోతే వారి భవిష్యత్తు ఏంటి.? అని జగన్ అన్నారు. మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం నిరక్ష్యరాస్యులు ఉన్నారని సీఎం జగన్ అన్నారు. పిల్లల భవిష్యత్ గురించి గత పాలకులు ఆలోచించలేదని సీఎం జగన్ అన్నారు. పేదవాడు తెలుగు మీడియంలోనే చదవాలని మన సంసృతి చెబుతోందని వదిలేస్తే భవిష్యత్తులో సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆన్నారు. 
 
మన బడుల్ని ఇలానే కొనసాగించాలా...? అని సీఎం జగన్ ప్రశ్నించారు . ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తే మన పిల్లలు ప్రపంచపు జాబ్ మార్కెట్ తో పోటీ పడుతున్నారని జగన్ అన్నారు. మరో 20 సంవత్సరాల తరువాత ప్రపంచంతో పోటీ పడేలా అడుగులు వేయాలా...? వద్దా? నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని జగన్ అన్నారు. 
 
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మరో పదేళ్లకు మన పిల్లలు రోజు కూలీలుగా ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందని సీఎం జగన్ అన్నారు. రాజకీయంగాను, వ్యక్తిగతంగాను చేసేది తప్పు అనే విధంగా కొందరు విమర్శలు చేస్తున్నారని జగన్ అన్నారు. రాజకీయనాయకులు, పత్రికాధిపతులు, సినీరంగ ప్రముఖులు మీ బిడ్డలు, మీ మనవళ్లు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా...? పేదవాళ్లు చదవకూడదా..? అని సీఎం జగన్ ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: