ఇసుక మాఫియా పై టీడీపీ చార్జిషీట్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. జిల్లాల వారీగా ఇసుక అక్రమ రవాణా  చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు విడుదల చేసింది. ఈ మేరకు అచ్చెన్నా యుడు, ఆలపాటి రాజా  మీడియా సమావేశంలో మాట్లాడి జాబితా విడుదల చేశారు. 13 జిల్లాలలో 60 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనాయకుల ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారంటూ ఆరోపించింది. స్పీకర్ తమ్మినేని, ధర్మాన, బొత్స, జక్కంపూడి రాజా, కొలుసు పార్థ సారధి, ఉదయభాను,కొడాలి నాని, మోపిదేవి, మేకపాటి, బుగ్గన, తోపుదుర్తి, రోజా, పెద్దిరెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇసుక మాఫియాలో సంబంధం ఉందని ఛార్జ్ షీట్‌లో ఆరోపించింది టీడీపీ.


మ‌రి ఇప్పుడు ఇలా ఇసుక పైన ఉద్య‌మాలు న‌డుపుతున్న బాబుగారికి ఆయ‌న స‌మ‌యంలో జ‌రిగిన అక్ర‌మ ర‌వాణాలు గుర్తుకురావ‌డం లేదా అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అప్ప‌ట్లో కృష్ణాజిల్లా  ఇసుక అక్ర‌మ ర‌వాణాను అడ్డుకున్న దెందులూరు ఎమ్మార్వో వనజాక్షిపై స్థానిక ఎమ్మెల్యే చింత‌మ‌నేని అనుచ‌రులు దాడి చేశారు. న్యాయం జరుగుతుందని  ముఖ్యమంత్రిని కలిసిన కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్‌ వనజాక్షికి  అవమానం జరిగింది. 


అసలు ఘటన ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా సీఎం చేయకుండా 'తహసీల్దార్ అయిఉండి ఎందుకు ఇసుక ర్యాంప్ వద్దకు వెళ్లావని, నువ్వు వెళ్లకుండా పోలీసులను పంపిస్తే సరిపోయేది కదా, నీవు అక్కడికి వెళ్లడం వల్లే గొడవ జరిగిందని వనజాక్షిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లకు అడ్డుగా కూర్చొవడం వల్లే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడికి పాల్ప‌డ్డారు. చింత‌మ‌నేనిపై ప్ర‌భుత్వం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా ఏమీ తీసుకోలేదు. మ‌రి ఆయ‌న హ‌యాంలో జ‌రిగిన అవన్నీ గుర్తురాలేదా అని ఆశ్చర్య పోతున్నారు ఆంధ్రా జనం.


మరింత సమాచారం తెలుసుకోండి: