ఒకప్పుడు దీక్షకు ఒక గొప్ప పేరు ఉండేది.  ఫలానా నాయకుడు ఫలానా దానికోసం దీక్ష చేస్తున్నారు అంటే.. దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండేవారు.  రాజకీయ పార్టీల నుంచే కాదు, సామాన్య ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించేది.  ఈ మద్దతుతో  ఆ ఉద్యమం విజయవంతం అయ్యేది.  అయ్యేలా చూసేవారు.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు.  దీక్షలను ఎదో మొక్కుబడిగా చేస్తున్నారు.  


6 గంటల దీక్ష, 12 గంటల దీక్షలుగా విభజించి దీక్షలు చేస్తుండటం విశేషం.  దీక్షలు చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అని ఒక సమయం పెట్టుకొని నీడపట్టున కూర్చోవడం సాయంత్రం కాగానే ఎవరిదారిన వారు వెళ్లిపోవడంతో దీక్ష అయిపోయిందని అంటున్నారు.  ఇలా దీక్షలు చేయడం వలన ఎంతవరకు అనుకున్న విషయం క్యారీ అవుతుంది.  ఇలా దీక్ష చేయడం వలన పొలిటికల్ గా మైలేజ్ వస్తుందని, పొలిటికల్ గా కొంతవరకు విజయం సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటారు.  


ఈరోజు బాబాగారు 12 గంటల ఇసుక దీక్షను విజయవాడలో చేస్తున్నారు.  ఈ దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది.  ఈ మద్దతు చెప్తూనే ఇద్దరు ప్రతినిధులను దీక్షకు మద్దతుగా పంపారు పవన్ కళ్యాణ్.  12 గంటల దీక్షలో బాబుగారు ఏం సాధించబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది.  12 గంటల దీక్ష అంటే అదేమంత పెద్ద విషయం కాదు.  12 గంటలకు కూర్చుంటే యిట్టె ముగుస్తుంది.  ఇసుక దీక్షకు పెద్దగా మైలేజ్ రాదు.  


గంగానది ప్రక్షాళన చేయాలనీ హరిద్వారాలో ఓ స్వామిజి తన జీవితాన్ని బలిచేశారు.  గంగానది ప్రక్షాళన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు.  అలా కాకపోయినా.. కొన్ని రోజులపాటైనా నిరాహార దీక్ష చేస్తే దానివలన ఫలితం ఉంటుంది.  అంతేగాని, ఇలా 12 గంటలు, 8 గంటల దీక్ష చేసి, మీడియాలో హడావుడిగా కనిపిస్తే సరిపోతుందా చెప్పండి.  అలా చేయడం వలన ఉపయోగం ఏమి ఉండదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: