ముఖ్యమంత్రిగా జగన్ ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఆయన ప్రతి అడుగులో ఒక పధకం కనిపిస్తోంది. ఆయన ప్రతి ఆలోచనలో రాష్ట్రం కోసం తపన కనిపిస్తోంది. కొన్ని నిర్ణయాలు తడబాటు వల్ల అటూ ఇటూ అయినా జగన్ చిత్తశుద్ధిని మాత్రం ఎవరూ శంకించలేరు. ఇదిలా ఉండగా జగన్ పదేళ్ళ రాజకీయ జీవితంలో ఎపుడూ ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. ఒంటరిగానే పోరాడారు.


ఇపుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా జగన్ ది అదే ఒంటరి పోరాటం. నాకు రాజకీయంగా శత్రువులు ఎక్కువ అంటూ ఒంగోలు సభలో జగన్  సంచలనమైన ప్రకటన చేశారు. అన్ని వైపుల నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి తన మనసులోని మాటలను సభలో పంచుకున్నారు. తాను మంచి పని చేయాలనుకుంటే ఆటంకాలు స్రుష్టించేవారు ఎక్కువయ్యారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.


అయినా తాను వెనక్కు తగ్గనని,  పేద పిల్లల  ఉజ్వల భ‌విష్యత్తు కోసం తాను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని జగన్ అన్నారు. ఆంగ్లమాధ్యమం లేకపోతే రేపటి రోజున యువత భవిత ఏం అవుతుందని జగన్ ప్రశ్నించారు. సినిమా నటుడు నుంచి రాజకీయ ప్రముఖుల వరకూ అందరూ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ తాము మాత్రం సుద్దులు చెబుతున్నారని జగన్ అనడం విశేషం.


ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మొదటి నుంచి ఒంటరివాడే. ఆయన రాజకీయ జీవితమే ఒక్క అడుగుతో మొదలైంది. ఒంటరిగానే ఆయన కేసులను ఎదుర్కొన్నారు. అదే విధంగా ఆయన పదేళ్ళుగా అన్ని రాజకీయ పార్టీలతో పోరాటం చేస్తూ వచ్చారు. ఇపుడు కూడా జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా రాజ‌కీయ పార్టీలకు  టార్గెట్ గా ఉన్నారు. ఇది సహజం. జగన్ కి కూడా తెలిసిన విషయం. మొత్తం మీద చూసుకుంటే ప్రజలకు మేలు చేయాలనుకున్న  జగన్ తాను బాగా టార్గెట్ అవుతున్నానన్న దాని మీద ఒకింత ఆవేదన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: