శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించాలా? వద్దా? అనే అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది. దీనితొ శబరిమల వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. శబరిమల వివాదం పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి తన తీర్పు ప్రతిని చదివి విన్పిస్తూ.. ‘‘మతం అనేది మనిషికి, దైవానికి అనుసంధానం చేసేది మాత్రమే. మహిళలకు గానీ ప్రవేశానికి నిబంధనలు విధించడం జరగదు. శబరిమలలోకి మహిళల ప్రవేశం అనేది ఈ ఒక్క మతంతో ఆగదు. ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మసీదుల్లోకి మహిళల ప్రవేశం అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 


ఆలయం లో కి స్త్రీ ప్రవేశం ఎందుకు నిషిద్ధం 
ఆలయంలోకి రుతు క్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని.. శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురత్తమ్మను అగౌరవపరిచినట్లు అవుతుందని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ- ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది. 


ఇక అప్పటి నుంచి ఆలయం లో కి స్త్రీలను అనుమతించాలని కోర్టు ల్లో కేసులు వేశారు. ఈ వివాదం పై విచారించిన సుప్రీం కోర్టు ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆలయం లో కి స్త్రీలు ప్రవేశించాలని చూసారు, అయితే స్వామి భక్తులు మరియు ప్రజలు స్త్రీలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇక దేవస్థాన పండితులు ఏం చెబుతున్నారంటే "హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని.. అందువల్ల ఆయన ఆలయంలోకి రుతు క్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం." అని ఆలయ పండితులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: