ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించడం కోసం అధినేత చంద్రబాబు కింద మీద పడుతున్నారు. ఓ వైపు నేతలు వేరే పార్టీల్లోకి జంప్ చేసేస్తుండటం, మరోవైపు ఓడిన నేతలు సైలెంట్ అయిపోవడంతో పార్టీని బలోపేతం చేయాలని బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానిమీద విమర్శ చేయకుండా మాత్రం బాబు నిద్రపోవడం లేదు.


ఈ క్రమంలోనే బాబు రాజకీయం చేయడానికి ఇసుక అంశం దొరికింది. దాన్ని అడ్డం పెట్టుకుని గత మూడు నెలలుగా బాబు రాజకీయంగా పబ్బం గడుపుతున్నారు. అయితే వరదలు కారణంగా రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని ప్రభుత్వమే ఒప్పుకుంది. ఇక ఇప్పుడు నదుల్లో వరద తగ్గడంతో నిదానంగా ఇసుక లభ్యత పెరుగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుంది.


ఇలాంటి తరుణంలోనే బాబు 12 గంటల నిరాహార దీక్షకు దిగారు.  ఈ దీక్ష భవననిర్మాణ కార్మికుల కోసం అనడం కంటే టీడీపీ పార్టీ భవిష్యత్ కోసమని చెప్పొచ్చు. పైగా ఈ దీక్షలో కొందరు కార్మికులని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వారిని చూస్తుంటే ఏదో బలవంతంగా తీసుకొచ్చి కూర్చోపెట్టినట్లు కనబడుతుంది. అయితే ఇందులో నేతలు కార్మికుల సమస్యలు మాట్లాడటం కంటే బాబుని పొగడటం, జగన్ని తిట్టడమే సరిపోతుంది.


దీనికితోడు ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాల చేత మాట్లాడిస్తూ..బాబుని దేవుడని పొగిడిస్తూ అదేదో రియాలిటీ షో లాగా దీక్షని నడుపుతున్నారు. ఇక బాబు కూడా మీరు పొగడండి నేను చూస్తా అన్నట్లు నడుచుకుంటున్నారు. మొత్తం మీద బాబు చేస్తున్న దీక్ష టీవీలో వచ్చే రియాలిటీ షోనే తలపిస్తోంది. అన్న‌ట్టు రేపో మాపో వ‌ర‌ద‌లు త‌గ్గిపోతున్నాయి. ఇసుక ఎక్క‌డిక‌క్క‌డ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడు బాబు ఇదంతా నా దీక్ష అని డ‌ప్పుకునేందుకు కూడా రెడీగానే ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: