గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గోవా రాష్ట్రం పనాజీ నగరంలోని కలాన్ గుటీ బీచ్ కేంద్రంగా జరుగుతోన్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. గోవా క్రైం బ్రాంచ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని సమాచారం అందింది. పోలీసులు సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేయడానికి ఒక పోలీసును విటుడిలా పంపించారు. సెక్స్ రాకెట్ బాగోతాన్ని పోలీసులు ఒక స్వచ్చంద సంస్థ సహాయంతో కలిసి బయటపెట్టారు. 
 
పోలీసుల దర్యాప్తులో గోవాకు మహారాష్ట్ర రాష్ట్రం నుండి అమ్మాయిలను తీసుకొనివచ్చి వ్యభిచారం సాగిస్తున్నారని తేలింది. క్రైం బ్రాంచ్ పోలీసులు సెక్స్ రాకెట్ లో కీలక సూత్రధారులైన థోపిక్, అక్షయ్ లను అరెస్ట్ చేశారు. గోవా డీఎస్పీ మహేష్ గోవంకర్ పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు కావడానికి విటుడి వేషంలో వెళ్లిన పోలీస్ సెక్స్ వర్కర్ల కోసం వెతుకుతూ ఉన్నట్లు నటించాడు. 
 
ఆ తరువాత ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరకు వచ్చి తమ దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారని నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకొని సేఫ్ ప్లేసులో పని కానిచ్చుకోవచ్చని ఆ పోలీస్ కు చెప్పారు. పోలీస్ వెంటనే ముఠా గురించి మిగతా పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడి చేసి నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. 
 
గోవాలోని రాష్ట్ర మహిళల సదనానికి సెక్స్ రాకెట్ లో పట్టుబడిన యువతులను పోలీసులు తరలించారు. అమ్మాయిలకు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి సెక్స్ రాకెట్ లోకి లాగుతున్నారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేయడంలో సహాయం అందించిన ఆండ్రియా పెరీరా స్వచ్చందసంస్థకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: