సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా రంజన్ గోగోయి ఈనెల 17 వ తేదీతో పదవీవిరమణ చేస్తున్న సంగతి తెలిసిందే.  పదవీ విరమణ చేసే ముందు కొన్ని కీలక మైన తీర్పులు ఇవ్వాలని రంజని గొగోయి నిర్ణయం తీసుకున్నారు.  ఇందులో భాగంగా వరసగా తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టాడు.  ఈనెల 9 వ తేదీన అంటే శనివారం రోజున గొగోయి  ధర్మాసనం అయోధ్య కేసులో కీలకమైన తీర్పును ఇచ్చింది.  ఈ తీర్పు ప్రకారం వివాదాస్పదమైన భూమి 2.77 ఎకరాలు అయోధ్య ట్రస్ట్ కు చెందాలని తీర్పు ఇచ్చింది.  


అంతేకాదు, ఈ తీర్పు ప్రకారం, అయోధ్యలోని ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లింలు కేటాయించింది.  ఈ తీర్పు తరువాత సిజెఐ కేసు గురించి మరో తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు బెంచ్.  సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫీస్ ఆర్టీసీ పరిధికి కిందకు వస్తుంది అనే దానిపై గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.  ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు అధికారులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.  


ఈ రివ్యూ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు తీర్పును ఇచ్చింది.  సిజెఐ కూడా సుప్రీం కోర్టు పరిధిలోకే వస్తుందని పేర్కొన్నది.  ఈ తీర్పు అనంతరం కర్ణాటక శాసనసభకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను అనర్హలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ 17 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  కోర్టును దీనిపై నిన్నటి రోజున తీర్పు ఇచ్చింది.  


17 మంది సభ్యులపై అనర్హత వేటుపై స్పీకర్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూనే.. సభ్యులపై అనర్హత కాలాన్ని తగ్గించింది.  డిసెంబర్ 5 వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోర్టు కలిగించింది.  కోర్టు ఇచ్చిన తీర్పుతో 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాయిన్ అయ్యారు.  ఇదిలా ఉంటె, ఈరోజు మూడు తీర్పులు ఇచ్చింది.  ఇందులో ఒకటి శబరిమలలో మహిళల ప్రవేశంపై రివ్యూ పిటిషన్ కాగా, రెండోది రఫెల్, మూడోది రాహుల్ చౌకీదార్ వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్.  ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు రఫెల్ రివ్యూను, రాహుల్ చౌకీదార్ పిటిషన్ ను కొట్టివేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: