దేశవ్యాప్తంగా గతంలో జరిగిన ఎన్నికల తరువాత బిజెపి పార్టీ ఒకింత బాగా మెరుగుపడింది అనే చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మెజారిటీ లోక్ సభ స్థానాలు గెలుచుకుని మరొక్కసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ, మన రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా బాగానే దృష్టి పెట్టింది. అయితే ఆంధ్రతో పోలిస్తే ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ కు బిజెపి గట్టిగానే పోటీ ఇచ్చిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం అక్కడ బిజెపికి అద్యక్షులు గా ఉన్న లక్ష్మణ్ యొక్క పదవి కాలం డిసెంబర్ తో ముగియబోతుండడంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకునేందుకు కేంద్ర బీజేపీ అధినాయకత్వం అప్పుడే గట్టిగా పనులు ప్రారంభించిందట. 

ఇక ఈ రేసులో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతో పాట ఎంపీ బండి సంజయ్‌ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అధికార టీఆర్ఎస్‌ పార్టీతో పోరాటం చేసి రాష్ట్రంలో బీజేపి బలం పెంచాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రనాయకత్వం, లక్ష్మణ్ స్థాయిలో మంచి సమర్ధుడైన నాయకుడి కోసం బాగా జల్లెడపడుతోందట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న పేర్లలోని వారిలో ఒకరు తప్పకుండా రాష్ట్ర అధ్యక్షడు అయ్యేందకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెప్తున్నారు. 

ఇక సమర్ధుడైన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం సీనియర్ నాయకులైన బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి సహా మరికొందరు సీనియర్ నాయకుల సలహాలు కూడా తీసుకుంటుందట అధినాయకత్వం. అయితే మోడీ, అమిత్ షా కూడా ఈ విషయమై ఎంతో శ్రద్ధ పెట్టారని, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో తమ పార్టీపై మంచి ఆదరణ ఉందని, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నుకోబోయే అధ్యక్షుడు తప్పకుండా పార్టీ ప్రతిష్టను మరింతగా పెంచేలా ఉండాలని భావిస్తున్నారట. మరి తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారు అనేది తెలియాలంటే మరికొద్దిరోజలు ఓపికపడితే సరిపోతుంది....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: