ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత మరియు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్ష పైన రాష్ట్రంలోని ప్రజలందరిలో మధ్య తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు బాగా లేనప్పుడు మరియు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తిన సమయంలో రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఒక పక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొత్తుకొని వివరిస్తున్నా రాజకీయ స్వలాభం కోసం బాబు దీక్ష చేపట్టారని రాజకీయ పండితులు అంటున్నారు.

అయితే చేసే ఆ దీక్షను కూడా చంద్రబాబు నాయుడు నిష్ఠగా ప్రజల కోసం అన్నట్లు కాకుండా ఏదో తన భవిష్యత్తు రాజకీయాల స్వలాభం కోసం అన్నట్లు ఉందని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ దీక్ష మరికొద్ది గంటల్లో ముగియనుంది. అయితే దీక్షలో మాట్లాడిన బాబు జగన్ సర్కార్ పై విరుచుకు పడిన తీరు చూస్తుంటే అందరికీ చాలా తేడా కొట్టింది. ఏపీ లో ఇసుక కొరత కావాలని సృష్టించారని మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏపీ లో ఇసుకను దోచేసి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మరియు ఒరిస్సా రాష్ట్రాలకు చేరుస్తున్నారు అని అనడం అందరినీ విస్మయపరిచింది. అసలు వినడానికి కూడా నమ్మశక్యం కాని రీతిలో బాబు మాట్లాడిన తీరు ఎవరికీ అర్థం కాలేదు.

ఇక అసలు విషయానికి వస్తే ఇసుక కొరత మరియు భవన కార్మికుల నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తే అతని పై జగన్ ఫైర్ అయిన విధానం ఏమాత్రం బాగలేదని బాబు అన్న విషయం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక పెద్ద చర్చగా నిలిచింది. దీన్ని బట్టి చూస్తే బాబు మరియు పవన్ కలిసి రాజకీయం చేస్తున్నారని పలువురు విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అదీ కాకుండా టిడిపి హయాంలో వచ్చిన ఇసుక విధానం వల్ల ప్రజలు నష్టపోయినపుడు పవన్ ఏ మాత్రం స్పందించిన తీరు మరియు ఇప్పుడు పవన్ కు జగన్ కౌంటర్ ఇస్తే బాబు వెనకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఇదేదో తేడా వ్యవహారం లాగుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: