కర్ణాటక రాష్ట్రంలో జులై నెలలో కుమారస్వామి బలనిరూపణ సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించటంతో స్పీకర్ 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశాడు. అనర్హత వేటు 12మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు ఇండిపెండెంట్లపై పడింది. 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ 2023 సంవత్సరం వరకు ఈ 17మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను మాత్రం సుప్రీం కోర్టు కొట్టివేసింది. 
 
డిసెంబర్ నెల 5వ తేదీన 17స్థానాలలో 15స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక హైకోర్టులో రెండు స్థానాలకు సంబంధించిన విఛారణ జరగనున్న నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించటం లేదు. కుమారస్వామి ప్రభుత్వ పతనానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ కేంద్ర నాయకులను కలిశారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనర్హత వేటుకు గురైన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. 
 
బీజేపీ పార్టీ తమ పార్టీ అభ్యర్థులుగా డిసెంబర్ 5వ తేదీన జరిగే అసెంబ్లీ ఉపఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలను బరిలో నిలిపింది. బీజేపీ పార్టీ అభ్యర్థులుగా హెచ్ విశ్వనాథ్, కేసీ నారాయణ గౌడ, ఎంటీబీ నాగరాజ్, కే గోపాలయ్య, సోమశేఖర్, బైరతి బసవరాజ్, సుధాకర్, ఆనంద్ సింగ్, బీసీ పాటిల్, శివరాం హెబ్బర్, రమేశ్ జర్కిహోలి, శ్రీమంతగౌడ్ పాటిల్, మహేశ్ కుమతల్లి పోటీ చేస్తున్నారు. 
 
సుప్రీంకోర్టు 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలు పోటీ చేయకూడదని స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. రెబల్ ఎమ్మెల్యేలు కోర్టు నిర్ణయం తరువాత బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ ఎన్నికలు జరగబోయే 15 స్థానాలలో బీజేపీ పార్టీ గెలుపొందుతుందని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: