రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కేంద్రానికి ఊరట లభించింది. రాఫెల్‌పై దాఖలైన రివ్యూ పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది సుప్రీం కోర్టు. గతంలో ఇచ్చిన తీర్పులను సమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై విచారణ జరపలేమని తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌లను కొట్టివేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కోర్టుల విచారణ సరికాదని తెల్పింది. తీర్పును పున: సమీక్షించాల్సిన అవసరం లేదని వివరించింది. ఏడాది కిందట ఇచ్చిన తీర్పును సమర్థించింది. 


ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని.. సుప్రీంకోర్టు నేతృత్వంలో వీటిపై విచారణ జరగాలని పిటిషనర్లు కోరారు. సుప్రీం తీర్పుని సమీక్షించాలని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌, ఆప్ నేత సంజయ్ సింగ్‌ రివ్యూ పిటిషన్లు వేశారు. వీటిపై ఇవాళ విచారణ జరిపింది. రాఫెల్‌ విమానాల కొనుగోలులో విచారణ అవసరం లేదని రివ్యూ పిటిషన్‌లను కొట్టేసింది. 


india NATIONAL CONGRESS' target='_blank' title='కాంగ్రెస్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాంగ్రెస్‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.  చివరికీ సత్యమే గెలిచిందన్నారు. ఇప్పటికైనా india NATIONAL CONGRESS' target='_blank' title='కాంగ్రెస్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాంగ్రెస్‌ తన తీరు మార్చుకోవాలని సూచించారు. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధవిమానాలను భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 58 వేల కోట్ల అగ్రిమెంట్‌లో 15శాతం నిధుల్ని ముందే చెల్లించాలి. 58 వేల కోట్లలో 20 శాతం నిధుల్ని భారత్‌లోని పరిశ్రమల నుంచి విడిభాగాల సేకరణ చేయాలి. ఇందుకోసం భారత్‌ ఎంపిక చేసిన సంస్థల నుంచి దసో కంపెనీ తనకిష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు. యూపీఏ-2 హయాంలో జరిగిన ఒప్పందాన్ని ఎన్డీఏ సర్కార్‌ మార్చడంతో... వివాదం చెలరేగింది. అనిల్‌ అంబానీ కోసమే నిబంధనలను సడలించారని కాంగ్రెస్ ఆరోపించింది.  


దేశ భద్రతను చూపుతూ కేంద్రం రాఫెల్‌ ఒప్పందాన్ని చెప్పడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరాయి. ఏడాది కిందటే విచారణ జరిపి.. అన్ని పిటిషన్‌లను కొట్టివేసింది సుప్రీం కోర్టు. 



మరింత సమాచారం తెలుసుకోండి: