సీ.ఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలు పి.వి.ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువులను ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో లో 45 వేల స్కూళ్ళలో మూడు దశలుగా ఈ నాడు-నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అయితే జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు వచ్చిన పలువురు విద్యార్థులు ఏపీలో ప్రతిపక్ష నేతల పై విసిరిన సెటైర్లు భారీ గా పేళాయి.

అందులో మైక్ అందుకున్న విద్యార్థులు ప్రతిపక్ష నాయకులు తమ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం వద్దని ఎందుకంటున్నారో తమకు అర్థం కావట్లేదని, వాళ్ల పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవచ్చు కానీ మేం మాత్రం ఏం పాపం చేశాం సార్ అంటూ ఆ విద్యార్థి ప్రశ్నించడంతో వేదిక చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని తెలుగు భాష రాని నారా లోకేష్ మరియు ఇంటర్ పాస్ కాని పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు అని, కానీ ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే తమకు ఇంగ్లీష్ అవసరమంటూ ఆ బాలిక చెప్పిన తీరు చూసి అందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు. 

మైకు అందుకున్న ఇంకొక బాలిక ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్తున్నా కేవలం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే తమ బాధను అర్థం చేసుకొని ఎంతో మంచి వసతులు మరియు సదుపాయాలను కల్పిస్తున్నారని చెప్పింది. మిగతా వారు తమకు ఓటు హక్కు లేదని అందుకే ఈ నాయకుడూ విద్యార్థులను పట్టించుకోలేదని కానీ జగన్ మనసున్న మారాజు కాబట్టి మా కోసం పాఠశాలల తీరు మారుస్తున్నారని  సీఎం జగన్ ను కొనియాడింది. ఇలా ప్రతిపక్ష నాయకులపై సెటైర్లు వేస్తూ జగన్ కు మద్దతుగా విద్యార్థులు గళమెత్తిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు విద్యార్థులు మాట్లాడిన వీడియో చూశాక ఈ నేతలు ఏమంటారో వేచిచూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: