అవును నిజంగానే భిన్న మనస్తత్వాలున్న ఇద్దరు మనుషులున్నట్లే  అనిపిస్తోంది. అదేదో సినిమాలో స్ల్పిట్ పర్సనాలిటి లాగనుకోండి. గురువారం ఇసుకకొరత దీక్ష సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నిజమే అనిపిస్తుంది.  చంద్రబాబులో ఇద్దరున్నారన్న విషయాన్ని టిడిపి నేతలే చెప్పుకుంటున్నారు. మొదటి చంద్రబాబేమో అధికారంలో ఉన్నపుడు మాత్రమే కనిపిస్తారు. ఇక రెండో చంద్రబాబు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నపుడే బయటకు వస్తారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు సర్వ వ్యవస్ధలను భ్రష్టుపట్టించేస్తుంటారు. నియమాలు, నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయరు. తాను ఏమి చేయదలచుకుంటే అది చేసేస్తుంటారు. ఈ విషయాలన్ని మొన్నటి ఐదేళ్ళ అందరూ చూసిందే.

 

తాను సిఎంగా ఉన్నపుడు రాష్ట్రంలో ప్రతిపక్షమే అవసరం లేదన్నారు.  ప్రతిపక్ష నేతలను కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టారు.  చాలామంది వైసిపి ఎంఎల్ఏల మీద కూడా కేసులు పెట్టించారు. కొందరు నేతలను జైళ్ళకు కూడా పంపారు. ఇద్దరు ముగ్గురు నేతలు రోడ్డుమీదే, ఎంఆర్వో కార్యాలయంలోనే హత్యకు గురైనా ఏమాత్రం పట్టించుకోలేదు. సరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే.

 

అలాంటి చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో  జనాలు గూబగుయ్యిమనిపించారు. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చారో వెంటనే రెండో చంద్రబాబు బయటకు వచ్చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిపనిలోను తప్పులు వెదకటం మొదలుపెట్టారు. చివరకు జగన్ ఏం చేసినా చేయకపోయినా కూడా తప్పే అన్నట్లుగా విరుచుకుపడిపోతున్నారు.

 

వర్షాలు, వరదల కారణంగా ఇసుకను తియ్యలేకపోయామని జగన్ అంటుంటే ప్రభుత్వం కృత్రిమకొరతను సృష్టించిందని నానా రచ్చ చేస్తున్నారు. తమ పార్టీ నేతలను జగన్ ఒత్తిడిపెట్టి బలవంతంగా లాక్కుంటున్నారంటూ ఒకటే గగ్గోటు పెట్టేస్తున్నారు. నిజానికి చంద్రబాబు మీద నమ్మకం లేకే చాలామంది నేతలు బిజెపిలో చేరుతున్నారు.

 

ఎక్కడ ఏమి జరిగినా చివరకు దాన్ని జగన్ కు ముడేసి తన ఎల్లోమీడియా ద్వారా రచ్చ చేయిస్తే కానీ రెండో చంద్రబాబు శాంతించటం లేదు. ఇవన్నీ చూసే టిడిపి నేతల్లోనే చంద్రబాబులో అపరిచితుడున్నాడంటూ సరదాగా చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయం చంద్రబాబు బుర్రకు ఎప్పుడెక్కుతుందో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: