సుధీర్ఘ పాదయాత్ర అనుభవమో, లేక ప్రజలకు మంచి చేయాలనో తపనో గానీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనంకి ఏం కావాలో బాగా తెలిసినట్లుంది. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం లాగా తిమ్మిని బొమ్మి చేసి చూపకుండా ఏదైతే అనుకున్నారో అదే ఖచ్చితంగా ప్రజలకు అందేలా చేస్తున్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చిన జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. వాటి పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలోనే జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పేద విద్యార్ధి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు, ఇతర పార్టీలు, తెలుగు బాషా వక్తలు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారు తెలుగు బాషా ఇబ్బందుల్లో పడిపోతుందని మాట్లాడుతున్నారు.


అయితే జగన్ ప్రతిపక్షాలన్నిటికి ఒక్కసారి కౌంటర్ ఇచ్చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న వాదిస్తున్న నేతలు వారి పిల్లలని ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ప్రతిపక్షాలు ఇంగ్లీష్ మీడియంపై రాద్ధాంతం చేస్తున్న, ప్రజలు మాత్రం ఇంగ్లీష్ మీడియం గట్టిగా కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో స్పష్టంగా అర్ధమవుతుంది.


చాలా మీడియాలు పెట్టిన పోల్స్ లో ఇంగ్లీష్ మీడియం కావాలని అత్యధిక ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఈ విషయం జగన్ పాదయాత్రలోనే తెలుకున్నట్లు అర్ధమవుతుంది. పాదయాత్రలో ఇలాంటి పరిస్తితి చూసే జగన్ ఈ హామీ ఇచ్చారు. అందుకే అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసిన వెనక్కి తగ్గడం లేదు. ఏదేమైనా ఈ విషయంలో జనం జగన్ వెంటే నడుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: