ఎమ్మార్వో హసీనాబీ .. లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు హసీనాబీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాల కు అలవాటు పడి ..ఏసీబీ అధికారుల కి అడ్డంగా దొరికి పోయింది. ఇక అప్పటినుండి ఏసీబీ అధికారుల కి చిక్కకుండా మరో వ్యక్తి తో కలిసి మకాం మార్చుతూ ... అధికారుల కళ్ళు కప్పి తిరుగుతుంది. ఈమె ఒక వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డబ్బు ఆమె డైరెక్ట్ గా తీసుకోక పైనా ..తన తమ్ముడి తో ఈ వ్యవహారం అంతా నడిపింది. ఈ నెల 8న సురేష్ అనే వ్యక్తి నుంచి రూ.4 లక్షలు తీసుకున్న మహబూబ్ బాషాను ఏసీబీ అరెస్టు చేసింది.


అయితే ఏసీబీని బురిడీ కొట్టించాడు మహబూబ్ బాషా తన ఇంట్లో పనిచేసేవాణ్ని అని అబద్దం చెప్పాడు.  కానీ తాజాగా వారి తల్లిదండ్రుల ని తీసుకోని వచ్చి విచారణ చేయగా ..అసలు వ్యవహారం బయట పడింది. ఆమె కోసం ఏసీబీ అధికారులు విచారిస్తున్న సమయం లో మరిన్ని కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి.  హసీనాబీ తల్లిదండ్రుల ను కలిసిన ఏసీబీ అధికారుల కు అసలు విషయం తెలిసింది. హసీనాబీ నలుగురు సోదరుల్లో మహబూబ్ బాషా ఒకరని ఆమె తల్లిదండ్రులు ఏసీబీ అధికారుల కు తెలిపారు. తమ తో గాని ఇతర సోదరులతో గాని హసీనాబీ కి మాటలు రాక పోకలు లేవని కూడా ఏసీబీ అధికారుల కు వివరించారు. మహబూబ్ బాషా తో మాత్రమే అప్పుడప్పుడు హసీనాబీ మాట్లాడేవారని కూడా తల్లిదండ్రులే ఏసీబీ అధికారులకు తెలిపారు.


అంతే కాకుండా ఆమె ఎవరితోనూ కలిసి ఉండేదని ఆయనెవరో తమకు తెలియదని చెప్పుకొచ్చారు. దీనితో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు చివరికి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఎక్కడ ఉన్నదో కనుగొన్నారు. అక్కడ హసీనాబీ ఓ వ్యక్తితో దిగిన ఫొటోలు వారికి లభించాయి. ఆరా తీస్తే ఆ వ్యక్తి కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య అని తేలింది.గిడ్డయ్య ఈ నెల 8 నుంచి పరారీలో ఉన్నట్లు తేలింది. ఈనెల 11 నుంచి నెల రోజుల పాటు ఆయన మెడికల్ లీవ్ పెట్టి వెళ్లినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: