రాజకీయంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి...? ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు అర్ధం కానీ ప్రశ్న ఇది. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు నేడు ఆ పార్టీని ముంచేశాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు వైఖరి పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సీట్ల ప్రభావం, బలంగా ఉన్న సమయంలో నేతలను అదుపు చేయలేకపోవడం వంటివి ఇప్పుడు పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేశాయి.


గురువారం పార్టీ మారిన దేవినేని అవినాష్... పెనమలూరు సీటు కోసం ప్రయత్నాలు చేయగా.. చంద్రబాబు ఆయన్ను గుడివాడ పంపించారు... అక్కడ నానీ బలంగా ఉన్నారని పలు నివేదికలు చెప్పినా సరే చంద్రబాబు మాత్రం వినలేదు. ఇక చింతమనేని ప్రభాకర్ ని పక్కన పెట్టమని చెప్పినా, కొందరికి పార్టీలో ప్రాధాన్యత తగ్గించమని సూచించినా ఆయన మాత్రం వినలేదు. నేడు పార్టీ అధికారం కోల్పోయింది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వారు మాత్రమే మిగలగా... యువనేతలు పార్టీ మారిపోతున్నారు.


వారు భవిష్యత్తుని వెతుక్కుంటూ అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. దీనితో జిల్లాల్లో క్రమంగా పార్టీ బలం కోల్పోతుంది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకపక్క పార్టీలో యువనేతలు లేరని కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే... వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారి అభిప్రాయాలు తీసుకోకుండా, చంద్రబాబు ఎంత సేపు సీనియర్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించడం వారి సలహాలతో ముందుకి వెళ్లడం వంటివి చేస్తున్నారు.


ఇక బాబుతో పాటు లోకేష్ కూడా కొన్ని కులాల‌కు ప్ర‌యార్టీ ఇస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిణామాలే పార్టీని ఆత్మహత్య చేసుకునే విధంగా ముందుకి తీసుకు వెళ్తున్నాయి. చంద్రబాబు రాజకీయంతో ఆ పార్టీ ఇప్పుడు బ్రతికే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు... దీనితో ఆత్మహత్య చేసుకున్నట్టే అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: