జయంతికి వర్ధంతికి తేడా తెలియని వాళ్ళు విమర్శిస్తే నేను పడాలా...?" గురువారం మీడియా సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్య ఇది. దేవినేని అవినాష్ పార్టీ మారే ముందు సన్నిహితులతో... అక్కడ ఉన్న అభద్రతా భావంతో నేను ఇబ్బంది పడుతున్నాను... నేను ఎంత కష్టపడుతున్నా సరే నాకు ఏ మాత్రం విలువ ఉండటం లేదు. నన్ను ఎంత వరకు కట్టడి చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


మరో యువనేత నా నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏంటి...? నా నియోజకవర్గ నేతలతో ఆయన మాట్లాడటం ఏంటి...? ఇవన్నీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని లక్ష్యంగా చేసుకుని వీరు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలే. రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రోత్సహించాల్సిన లోకేష్ వారిని ఇబ్బంది పెడుతూ ప్రయత్నాలు చేయడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.


దేవినేని అవినాష్ గురజాల వెళ్లిన సమయంలో... లోకేష్ నుంచి ఒక పార్టీ పెద్దకు ఫోన్ వెళ్ళింది. ఆయనతో అవినాష్ ని తగ్గి ఉండమని చెప్పండి అంటూ... ఒక సూచన వెళ్ళింది. అనంతపురం జిల్లాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఉత్సహంగా పని చేసే యువనేతను, లోకేష్ అదుపు చెయ్యాలి అని చూడటం కూడా ఇబ్బంది పెట్టింది. ఆయన ఇబ్బంది పెడుతున్న నేతలు అందరూ కూడా... కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే. అటు గల్లా జయదేవ్ ని కూడా లోకేష్ ఇబ్బంది పెడుతున్నారు.


ఎక్కడ గల్లాకు పేరు వస్తుందోనని లోకేష్ ఆయనకు కొందరిని దూరం చేశారట. ఇప్పుడు జెసి కుటుంబం కూడా లోకేష్ తీరుతో ఇబ్బంది పడుతుంది. వాళ్ళను జిల్లాకే పరిమితం చెయ్యాలని లోకేష్ భావించారు. మహిళా నేతలను మినహా మిగిలిన యువనేతలు అందరిని కూడా లోకేష్ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆయన తీరుతో వారు కూడా పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: