వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటాడు.  పైకి చూడటానికి నవ్వుతు కనిపిస్తాడు.  కానీ, ఒకసారి రంగంలోకి దిగితే ఆ దెబ్బ వేరుగా ఉంటుంది.  దానికి చాలాఉదాహరణలు ఉన్నాయి.  అందులో ఒకటి ఇటీవలే పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చేశారు.  విశాఖలో లాంగ్ మార్చ్ చేసిన తరువాత పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఓ సీనియర్ నేతను వైకాపాలోకి తీసుకోవడంతో జనసేన షాక్ తిన్నది.  


జనం కోసం లాంగ్ మార్చ్ చేస్తుంటే.. చివరి వరకు కలిసి ఉంటామని చెప్పిన పార్టీ నేతలు ఇలా ప్లేట్ ఫిరాయిస్తుంటే అందరు షాక్ అవుతున్నారు.  ఎందుకు ఆలా చేస్తున్నారో అర్ధంగాక ఇబ్బందులు పడుతున్నారు.  ఇక ఇదిలా ఉంటె, జగన్ దెబ్బకు ఇప్పుడు బాబుకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు.  ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు దీక్ష చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్న సమయంలో జగన్ బాబుకు డబుల్ షాక్ ఇచ్చాడు.  


బాబుగారు దీక్ష చేస్తున్న సమయంలో సడెన్ గా మధ్యాహ్నం సమయంలో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిపోయాడు.  అక్కడ దీక్ష జరుగుతున్న సమయంలోనే ఇలా జరగడం విశేషం.  దీక్ష సాయంత్రం సమయంలో వల్లభనేని వంశి మరో షాక్ ఇచ్చాడు.  బాబు గురించి లోకేష్ బాబు గురించి, అటు పవన్ బాబు గురించి రచ్చ రచ్చగా మాట్లాడారు.  ఎందుకు మాట్లాడారో తెలియదు.  


తీరా కారణం చూస్తే.. వంశి కూడా జంప్ అవుతున్నారని వార్తలు వచ్చాయి.  జంప్ అవుతున్నాడు కాబట్టే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు.  జయంతికి వర్ధంతి తేడా తెలియకుండా మాట్లాడే వ్యక్తులు పార్టీని నడిపిస్తున్నారని లోకేష్ గురించి డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.  పవన్ కళ్యాణ్ గురించి కూడా వంశి కామెంట్స్ చేయడం విశేషం. ఇలా వరస కామెంట్స్ తో వంశి బిజీ అయ్యాడు.  తాజా సమాచారం ప్రకారం వంశి కూడా రేపోమాపో టిడిపి గడప దూకేస్తున్నాడని అర్ధం అవుతున్నది.  ఎలాగో టీడీపీ అధికారంలో లేదు..ఎమ్మెల్యేగా ఎక్కడ ఉన్నా ఒకటే అనే ఉద్దేశ్యంతో వంశి గోడదూకేశాడు.  సరే మాములుగా ఉన్నప్పుడు మాట్లాడితే అది వేరుగా ఉంటుంది.  స్వామి మాలవేసుకొని కూడా అలా మాట్లాడటం ఏంటో విచిత్రం కాకుంటే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: