తెలుగుదేశం  పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ , ఆ పార్టీ నాయకత్వం పదునైన విమర్శలు చేయడం   వెనుక పెద్ద వ్యూహమే  ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి  . ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేయకుండా, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగేందుకే ,  టీడీపీ నాయకత్వం పై  అయన  విమర్శలు గుప్పించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది .


టీడీపీ కి రాజీనామా చేసిన వంశీ మోహన్ నేరుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరకుండా , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రశంసించడమే కాకుండా ,టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేయడం వెనుక అయన అంత్యర్యం ఏమిటో స్పష్టం అవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఎవరైన ఎమ్మెల్యేలు  చేరాలంటే ముందు తమ  శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి  షరతు విధించిన నేపధ్యం లో , రాజీనామా చేయకుండా తప్పించుకోవడానికే వంశీ ఈ ఎత్తుగడ వేశారని విశ్లేషిస్తున్నారు . టీడీపీ నాయకత్వం పై వంశీ విమర్శలు గుప్పించడంతో ఆయనపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేస్తే , ఇక అతనిపై అనర్హత వేటు వేయమని స్పీకర్ కు ఫిర్యాదు చేసే అవకాశమే ఉండదని అంటున్నారు .


అందుకే వంశీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరకుండా , ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగాలని నిర్ణయించుకుని , టీడీపీ నాయకత్వాన్ని తూర్పారబట్టినట్లు తెలుస్తోంది .  . వంశీ ఒకవేళ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి ఉంటే, అతనిపై అనర్హత వేటు వేయమని ఇప్పటికే టీడీపీ శాసనసభా పక్షం ఫిర్యాదు చేసి ఉండేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు . ఇప్పుడు టీడీపీ నాయకత్వం పై వంశీ  విమర్శలు చేసినా, ఆ పార్టీ నాయకత్వం ఏమి చేయలేని అచేతనావస్థ లో ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి .  


మరింత సమాచారం తెలుసుకోండి: