ఆడవాళ్లు, చిన్నపిల్లలపై రోజు రోజుకు అత్యాచార వేధింపులు  జరుగుతూనే ఉన్నాయి. బాలికలను అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించేలా పోక్సో చట్టాన్ని సవరించినా కూడా  బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఓ 16ఏళ్ల బాలికపై కొందరు యువకులు అత్యాచారం చేసి, ఆ తర్వాత సజీవదహనం చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో చోటు చేసుకుంది.


ఇలీవ‌లె ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం గత ఆరు నెలల్లోనే ఒడిశా రాష్ట్రంలో 1,005 మంది బాలికలు, మహిళలపై అత్యాచారం కేసులు జరగడం సంచలనం రేపింది. రాష్ట్రంలోని బాంగ్రీపోసి, రసగోబింద్ పూర్. కరంజియా పట్టణాల్లో మంగళవారం ఒక్కరోజే జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాలికలను లైంగికంగా వేధించారు. ఈ మూడు పట్టణాల్లోనూ ఒకేరోజు జరిగిన అత్యాచార ఘటనలపై ఒడిశా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


దీనిపై కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు నరసింగ మిశ్రా అసెంబ్లీలో ప్రస్థావించారు. అత్యాచారం కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని మిశ్రా సర్కారును డిమాండ్ చేశారు. ఒడిశా రాష్ట్రంలో పెచ్చుపెరిగిపోతున్న అత్యాచారం ఘటనలపై అసెంబ్లీలో చర్చించి నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టాలు చేయాలని బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే లతికా ప్రధాన్ సర్కారును కోరారు. అత్యాచారాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాలని లతికా ప్రధాన్ డిమాండ్ చేశారు. ఒడిశా సర్కారు కూడా అత్యాచారం ఘటనలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.


అభంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నపిల్లలకు ఇష్టమైన బొమ్మలనో, చాక్లెట్లనో చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మృగాళ్ళు. అలాంటి సంఘటలు రోజు రోజుకు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. అలాగే త‌మిళ‌నాడులో కూడా ఈమ‌ధ్య కాలంలో ఏకంగా 11మంది యువకులు ఒక చిన్నారిని నాలుగురోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: