ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జ‌రుగుతుండం...మ‌రోవైపు అధికారం చేప‌ట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిణామాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు అంశంలో తొందరపడలేదని, 18 రోజులు వేచి చూశారని అన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై అమిత్‌ షాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, న్యాయవాది కపిల్‌ సిబాల్ ఘాటుగా స్పందించారు. కపిల్‌ సిబాల్‌ నిప్పులు చెరిగారు.


ఎన్నికల్లో మా కూటమి గెలిస్తే ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని ముందే చెప్పామని అమిత్‌ షా అన్నారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ఇపుడు మాత్రం కొత్త డిమాండ్లు తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు. గవర్నర్‌ను కలిసేందుకు ఇప్పటికీ తమకు సంఖ్యాబలం ఉందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంఖ్యాబలం ఉంటే ఏ పార్టీ అయినా గవర్నర్‌ను కలవొచ్చన్నారు. రాజకీయ పార్టీలను ఎలా విచ్ఛిన్నం చేయాలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిపై మండిపడ్డారు. ఎలా ఏకం చేయాలో అమిత్‌ షాకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ఈ విషయాల్లో ఆయనకు బాగా అనుభవం ఉందన్నారు. ఆ పర్యావసనాలను గోవాలో కానీ, కర్ణాటకలో కానీ చూడొచ్చు అని కపిల్‌ సిబాల్‌ తెలిపారు. 


ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) విఫలమవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ సిఫారసు చేయడం.. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలుపడం చకచకా జరిగిపోయాయి.  అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి 48 గంటల సమయం ఇచ్చి... శివసేన, ఎన్సీపీకి 24 గంటల సమయం ఇవ్వడంపై శివసేన, ఎన్సీపీ నాయకులు గవర్నర్‌ కోశ్యారీపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: