పవన్ కళ్యాణ్ కి తెలంగాణ అంటే ఇష్టం కదా. ఆయన తరచూ చెబుతూంటాడు. తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నాయని. మరి తెలంగాణా బిడ్డలైన ఆర్టీసీ కార్మికులు రెండు నెలలుగా జీతలు లేకుండా సమ్మెలో ఉంటే పవన్ జనసేన ఏం చేస్తోంది. స్వయంగా పవన్ దగ్గర కు వచ్చి మరీ ఆర్టీసీ కార్మికులు తమకు మద్దతు ఇవ్వమని అడిగారు కదా. దానికి పవన్ చేసిందేంటి. 


ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి వూరుకున్నారు. మరి అక్కడ ముఖ్యమంత్రి కేసీయార్ అపాయింట్మెంట్ కోసం పవన్ మనుషులు ప్రయత్నం చేసినా దొరకలేదని ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి వూరుకున్నారు. మరి ఇక్కడ ఏపీలో భవన నిర్మాణ కార్మికులు తమకు ఇబ్బందులు ఉన్నాయంటే ముఖ్యమంత్రి జగన్ని కలిసారా. లేదే  చలో విశాఖ అన్నారు. అంతేనా లాంగ్ మార్చ్ చేశారు, జగన్ని తిట్టిపోశారు,  అక్కసు తీర్ఛుకున్నారు.


మరి ఇంత అన్యాయమా పవన్, తెలంగాణాకు ఒక న్యాయం. ఏపీకి మరో న్యాయమా అంటున్నారు. ఏపీ అంటే, అందునా జగన్ అంటే పూనకం వచ్చినట్లుగా రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ కి తెలంగాణాలో కేసీయార్ అంటే భయమా అన్న ప్రశ్న కూడా వస్తోందంటున్నారు. దీని మీద టీడీపీ ఎమ్మెల్యే వంశీ వల్లభనేని వంశీ పవన్ని కూడా కడిగేశారు. పవన్ తెలంగాణాలో ఒక న్యాయం. ఏపీ వద్దకు వచ్చేసరికి మరో న్యాయమా అని ఆయన సూటిగానే నిలదేశారు.


నిజమే ఏపీలో జగన్ అంటే చులకన కాబోలు, ఏం తిట్టినా పడతాడు అని కాబోలు ఇక్కడకు వచ్చి అన్ని పార్టీలు రంకెలు వేస్తాయి. చంద్రబాబు సైతం జాతీయ పార్టీ అయినా కూడా తెలంగాణా ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం ఎక్కడా చేసుకోలేదు. ఇపుడు తగుదునమ్మా అని ఆందోళన  చేస్తున్నారని వంశీ అన్న మాటలు జనం నుంచి వచ్చినవే. కనీసం ఆరు నెలల పాటు కూడా టైం ఇవ్వకుండా రెచ్చిపోవడం అంటే అధికార యావ తప్ప మరేం కాదని కూడా అంటున్నారు. మొత్తానికి అటు బాబును, ఇటు పవన్ని కూడా వంశీ వదలలేదుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: