శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం లోకి  అన్ని వయస్సుల  మహిళా అనుమతించాల్సిందిగా గత ఏడాది  సుప్రీం కోర్టు తీర్పునివగా, సుప్రీం  తీర్పుపై పలు  రివ్యూ పిటిషన్లను దాఖలయ్యాయి . గురువారం రివ్యూ పిటిషన్లను  విచారించిన సుప్రీంకోర్టు వాటిని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.  అయితే గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు మాత్రం సుప్రీం నిరాకరించింది .


గతం లో ఇచ్చిన తీర్పు పై సుప్రీం స్టే ఇచ్చేందుకు నిరాకరించిన నేపధ్యం లో అన్ని వయస్సుల మహిళలను దేవాలయం లోకి అనుమతించాలని తృప్తి దేశాయ్ పాటు పలువురు వామపక్ష నేతలు కోరుతున్నారు . గత ఏడాది సుప్రీం తీర్పు నేపధ్యం లో పలువురు మహిళలు ఆలయం లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా , భక్తులు వారిని అడ్డుకున్నారు . ఒకరిద్దరు మహిళలు పోలీసుల రక్షణ వలయం లో గుడిలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నప్పటికీ , భక్తులు మాత్రం ఆ వాదనలను కొట్టిపారేశారు . సుప్రీం తీర్పు అనంతరం గత ఏడాది  శబరిమల రణరంగంగా మారింది .  అయితే ఈ ఏడాది  శబరిమల దేవాలయం లోకి మహిళలను  అనుమతించాలా?,  వద్దా??  అన్నదానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ చెప్పారు.  కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్న వాటిని అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


  గతంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించని   నేపథ్యంలో  న్యాయ కోవిదులను సంప్రదించి మహిళల అనుమతి పై ఒక నిర్ణయం తీసుకుంటామని  పేర్కొన్నారు.  శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం పై నెలకొన్న  వివాదం పై దాఖలైన రివ్యూ పిటిషన్లను  సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయడం తో , శనివారం శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు తెర్చుకోనుండడం తో ఈసారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని  మహిళలకు ప్రవేశం లేనట్లేనని న్యాయనిపుణులు చెబుతున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: