జగన్ మీద ఒంటి కాలుతో లేచే చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్ దేముడెరుగు మొత్తానికి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇలా కడుపు మాడ్చుకుని దీక్షకు కూర్చున్నారో లేదో అలా షాకుల మీద షాకులే తగిలాయి. పుణ్యానికి పోతే ఏదో అయిందన్న చందంగా టీడీపీ దీక్ష తయారైంది. దీక్ష విషయమే హైలెట్ కాకుండా ఎన్ని రాజకీయాలు, ఎన్ని ట్విస్టులు. ఎన్ని మలుపులు, ఎన్ని పిలుపులు. మొత్తానికి దీక్షా ఫ్లాప్ అయిందా. హిట్ అయిందా...పెద్ద  డౌటే మరి.


బాబు దీక్షకు ఇలా కూర్చుంటే అలా క్రిష్ణా జిల్లాలో ప్రకంపనలు పుట్టాయి కదా. జగన్ మార్క్ పాలిటిక్స్ మొదలైంది. సాయంత్రం నాలుగు గంటలకు తెలుగు యువత ప్రెసిడెంట్ దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా  చేసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాడు. అంతేనా మరో గంట పోయాక టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వంశీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ పెద్దలను ఉతికేశారు. 


ఈ పరిణామాలతో ఇసుక దీక్ష కాస్తా నీరస దీక్షగా మారిపోయిందంటున్నారు. చంద్రబాబు సైతం ముగింపు సభలో మాట్లాడుతూ నన్ను నా పార్టీ వారి చేతనే జగన్ తిట్టిస్తున్నాడని ఆరోపించారు. అంటే బాబు ఇసుక దీక్షలో ఇసుక మాయమైంది.  రాజకీయమే ముందుకు వచ్చింది. మరి ఇసుక పేరిట సాగిన ఈ ఆందోళన టీడీపీకి ఏమిచ్చింది. కూసాలను కదిలించేసిందిగా. మొత్తానికి ఇసుక దీక్ష కూడా ధర్మ పోరాట దీక్షలతో సమానంగా మిగిలిపోయిందని వంశీ లాంటి వారే అన్నారంటేనే టీడీపీ తమ్ముళ్ళు అర్ధం చేసుకోవాలి. ఏది ఏమైనా ఇసుక అంటూ మస్కా రాజకీయం చేద్దామనుకున్న వారికి గట్టి దెబ్బ పడిపోయిందనే చెప్పాలి. ఏది ఏమైనా కానీ టైంలో కుదరని సందర్భంలో ధర్నాలు, ఆందోళనను అంటే పార్టీలోనే స్పందన ఉండదనడానికి ఒదొక ఉదాహరణ మాత్రమే.



మరింత సమాచారం తెలుసుకోండి: